సేంద్రియ వ్యవసాయం చేసి అధిక దిగుబడులు ఎలా సాధించాలో వివరిస్తూ, రైతుల పాలిట బయో పితామహుడిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన రాన్సాక్ ఆర్గా సీఈఓ డా. సి.వి.రత్నకుమార్ కు ప్రతిష్టాత్మకమైన తమిళ యూనివర్సిటీ చెన్నై గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. హైదరాబాద్ కు చెందిన రత్నకుమార్ గత 30 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం విధానంపై ఎప్పటికప్పుడు విస్తృత పరిశోధనలు చేసి ఆ దారిలో రైతులను ప్రోత్సహిస్తూ రాన్సాక్ ఆర్గా ద్వారా వారికి ప్రయోజనమైన సేంద్రియ ఎరువులను అందించి మంచి ఫలితాలు సాధించి పెట్టినందుకు ఆయనకు ఈ డాక్టరేట్ ప్రకటించినట్ట్లు తమిళ యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంటర్ నేషనల్ అనుబంధంగా కొనసాగుతూ విశేష పేరు ప్రఖ్యాతులు సాధించిన ఈ యూనివర్సిటీ గతంలో ఎందరో మహామహులకు డాక్టరేట్ లు అందించింది. ఈ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నవారిలో ప్రఖ్యాత గాయకులు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, ప్రముఖ దర్శకులు పి.వాసు, ప్రముఖ బ్యాడ్ మెంటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తదితరులు ఉన్నారు. ఈనెల 6న చెన్నైలో అతిరధ మహామహుల మధ్య అత్యంత వైభవంగా జరిగే ఈ ప్రదానోత్సవంలో సి.వి.రత్నకుమార్ కు ఈ డాక్టరేట్ ప్రదానం కానుంది.
సి.వి.రత్నకుమార్ కు తమిళ యూనివర్సిటీ డాక్టరేట్
RELATED ARTICLES