HomeTelugu*ఘనంగా ‘‘అక్షర’’ ప్రీ రిలీజ్ వేడుక*

*ఘనంగా ‘‘అక్షర’’ ప్రీ రిలీజ్ వేడుక*

నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న ‘‘అక్షర’’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఎమ్మెల్సీ కవిత, దర్శకులు సుధీర్ వర్మ, కృష్ణ చైతన్య, శ్రీకాంత్ అడ్డాల తదితర పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ‘‘అక్షర’’ సినిమా ఘన విజయం సాధించాలని టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. బిగ్ టికెట్ ను సాయి తేజ్, ఎమ్మెల్సీ కవిత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ...ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ ఎఫ్పుడు వచ్చినా మంచి హిట్స్ అవుతుంటాయి. అక్షర కూడా అలాగే విజయం సాధించాలి. నందిత శ్వేత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా నాకు ఇష్టం. అహితేజ బెల్లంకొండ నిర్మాత కంటే నాకు మిత్రుడు అని చెప్పుకుంటాను. చిన్నికృష్ణ నా స్నేహితుడు, అతను మంచి రచయిత, నటుడు కూడా. దర్శకుడు నటుడు అయితే నటీనటుల నుంచి ఎలాంటి ఔట్ పుట్ తీసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు. అన్నారు.

నటుడు మధునందన్ మాట్లాడుతూ..అక్షర సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. అక్షర సినిమాతో నిర్మాతలకు బిగ్ సక్సెస్ రావాలి. అన్నారు.

దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ…నేను చిన్ని కృష్ణ మేమంతా ఫ్రెండ్స్. నేను చదువుల్లో వీక్ అందుకే దర్శకుడిని అయ్యాను. బాగా చదువుకుంటే ఏ ఉద్యోగమో చేసుకునే వాడిని. అక్షర సినిమా టీమ్ కు నా బెస్ట్ విశెస్ చెబుతున్నాను. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ నగేష్ మాట్లాడుతూ…ఈ స్టోరీ నాకు నెరేట్ చేసినప్పుడు ఇదొక మీనింగ్ ఫుల్ మూవీ తప్పకుండా చేయాలని అనుకున్నాను. మాది రైతు కుటుంబం. ఇంటర్ చదివేప్పుడు చదువు మానేస్తానని అన్నప్పుడు సపోర్ట్ చేసి చదివించారు. అక్షర టీజర్ చూసినప్పుడు నా జీవితంతో రిలేట్ చేసుకున్నాను. ఎంతోకొంత చదువుకున్నాను కాబట్టే సినిమాటోగ్రాఫర్ కాగలిగాను. అన్నారు.

ఎడిటర్ సత్య గిడుటూరి మాట్లాడుతూ…అక్షర సినిమా ఇవా‌ళున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెబుతుంది. ఒక మంచి సినిమాగా గుర్తుండిపోతుంది. అన్నారు.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ..చిన్న కృష్ణ అండ్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అక్షర సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అన్నారు.

నటుడు హర్షవర్థన్ మాట్లాడుతూ…అక్షర సినిమా ఆలోచన కాదు చిన్నికృష్ణ ఆవేశం, ఆవేదన. ఎమ్మెల్సీ కవిత గారు ఈ కార్యక్రమానికి రావడం మాకెంతో సంతోషం. ఈ కథకు స్ఫూర్తి ఈతరం చదువుల పరిస్థితే. కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా అక్షర సినిమా ఉండదు. విద్యార్థులు అసలైన ఒత్తిడి ఉండేది కుటుంబం నుంచే. కష్టపడి కాకుండా ఇష్టపడి చదుకోవాలని చెప్పే చిత్రమిది. నా కెరీర్ లో ఓ మైలురాయి అక్షర సినిమా. స్టూడెంట్స్ ర్యాంకులు సాధించడం ఒక్కటే ముఖ్యం కాదు నాలెడ్జ్ పెంచుకోవడం ముఖ్యం అని చెప్పే సినిమా అక్షర. అన్నారు.

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..జై తెలంగాణ, అందరికీ నమస్కారం. ఈరోజు అక్షర సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్న చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. అనేక కారణాలు ఉన్నా, చదువుల్లో ఉన్న ఒత్తిడి ప్రధానమైన సర్వేలు చెబుతున్నాయి. మనమంతా ఒక సమాజంగా చేయాల్సిన పని ఉంది. ఆ బాధ్యతను అక్షర టీమ్ కొంత తీసుకుంది. నేనూ భాగం కావాలని నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. రోజుకు నలుగురు ఐదుగురు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు అని తెలిసిన తర్వాత మనం ఇంకా అప్రమత్తం కావాలని అనిపించింది. బట్టీ బట్టి సిలబస్ మార్చేసి సులువుగా విద్యను నేర్పే విధానాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. సినిమా మాధ్యమం ఎంతో శక్తివంతమైనది కాబట్టి సినిమా ద్వారా ఇలాంటి మంచి విషయం చెబితే సమాజానికి త్వరగా చేరుతుంది. తారే జమీన్ పర్ అనే సినిమా వచ్చాక, పిల్లలు సరిగ్గా చదవకపోతే తల్లిదండ్రులు ఎక్కడ లోపముందో ఆలోచించడం మొదలుపెట్టారు. అక్షర సినిమా చూశాక మన సమాజంలో విద్యను చూసే కోణంలో ఒక మార్పు రావాలి. నందిత బాగా నటించారని ఆశిస్తున్నా. అన్నారు.

హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ…అక్షర మూవీ ఎగ్జైటింగ్ తట్టుకోలేకపోతున్నా. ఒక గొప్ప ఫీల్ లో ఉన్నాను. ఎడ్యుకేషన్ కు సంబంధించిన మూవీ చేశాం అని ఎమ్మెల్సీ కవిత గారికి చెప్పినప్పుడు ఆమె వెంటనే స్పందించి వచ్చారు. థ్యాంక్స్ మేడమ్. సాయి తేజ్ తో నేను ఇప్పటిదాకా నటించలేదు. కానీ ఆయన మా హీరో అనే చెబుతాను. హీ ఈజ్ అవర్ హీరో. మా టీమ్ కు మీరు ఇచ్చిన సపోర్ట్ కు చాలా థ్యాంక్స్. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తర్వాత నాకు అక్షర సినిమా చాలా ఇంపార్టెంట్. లాక్ డౌన్ తర్వాత చాలా సినిమాలను థియేటర్లో హిట్ చేస్తున్నారు. అలాగే మా అక్షర మూవీని కూడా ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నా. మా కోసం కాకున్న మా నిర్మాతల కోసం సినిమా సూపర్ హిట్ కావాలి. దర్శకుడు చిన్ని కృష్ణ గారు పది సినిమాలు చేయమన్నా చేస్తాను, ఆయన నా బెస్ట్ డైరెక్టర్. ఈ నెల 26న మీ ముందుకొస్తున్నాం. ప్లీజ్ థియేటర్ కు రండి, మంచి మూవీని చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.

దర్శకుడు చిన్ని కృష్ణ మాట్లాడుతూ…మా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అక్షర సినిమా ట్రైలర్ చూపించేందుకు కవిత గారి దగ్గరకు వెళ్లాం. ట్రైలర్ చూశాక ఆమె దర్శకుడు ఎ‌వరు అని అడిగారు. అప్పుడు నాకు చాలా సంతోషమేసింది. ఎవర్ని గుర్తించాలనేది కేసీఆర్ గారికి తెలుసు. ట్రైలర్ చూడగానే నాలాంటి దర్శకుడిని గుర్తించినందుకు కృతజ్ఞతలు. ఎడ్యుకేషన్ మీద ఒక మంచి పాయింట్ చెబుదామని అక్షర చిత్రాన్ని చేశాం. సుప్రీమ్ హీరో సాయి తేజ్ గారితో నాకు ఏడు ఏనిమిది ఏళ్లుగా పరిచయం. ఎక్కడున్నా బాగున్నావా అని మాట్లాడుతారు. తేజ్ గారు మా కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్. నువు కామెడీ సినిమాలు చేస్తావు కదా, అక్షర లాంటి సినిమా చేశావు ఎందుకు అని అడిగారు. పేపర్లలో వచ్చిన కొన్ని ఘటనలు నేను ఈ కథ రాసేందుకు స్ఫూర్తినిచ్చాయి. సీఎం కేసీఆర్ గారు సినిమా ఇండస్ట్రీని కరోనా తర్వాత ఆదుకున్నారు. టాక్సులు మాఫీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ గారికి థ్యాంక్స్. కార్పొరేట్ విద్యపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నేను కథ రాసేప్పుడు చాలా స్ఫూర్తినిచ్చాయి. సాయి తేజ్, కవిత గారు రావడం వల్ల కోట్ల మందికి మా సినిమా చేరింది. అన్నారు.

నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ…ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడటం నాకు చాలా కొత్తగా ఉంది. స్టేజీ కింద ఉండి మా హీరోలను చూసి ఆనందపడటమే తెలుసు. ఇవాళ మా హీరో తేజ్ గారితో స్టేజీ మీద ఉండటం సంతోషంగా ఉంది. రెండేళ్లు అక్షర సినిమా కోసం కష్టపడ్డాం. ఈ సినిమా ప్రచారం చేయడం, రిలీజ్ చేయడం ఒత్తిడికి గురయ్యాం. మాకు తెలిసిన హీరోల్లో ఏకైక హీరో తేజ్ అన్న. ఆయన మేము అడగ్గానే తన షెడ్యూల్స్ మార్చుకుని మరీ మా కార్యక్రమానికి వచ్చారు. తేజ్ అన్న ఎప్పుడూ హీరోలా బిహేవ్ చేసేవారు కాదు. ఒక స్నేహితుడు, సోదరుడిలా చూసుకుంటారు. తన మంచితనం వల్లే ఇవాళ ఇంతటి స్థాయిలో ఉన్నారు. ఇవాళ కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరుగుతుంది అంటే అది సాయి తేజ్ అన్నయ్య వల్లే. ఎమ్మెల్సీ కవిత గారు అక్షర ట్రైలర్ చూసి మా సినిమా ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. అలాగే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. చిన్ని కృష్ణ అన్న కామెడీ సినిమాలు చేయిస్తారని అందరికీ తెలుసు కానీ ఆయన మంచి ఎమోషన్ రైటింగ్ కూడా చేయగలడు. ఈ సినిమా తర్వాత చిన్నికృష్ణ అన్న చాలా బిజీ అవుతారు. అన్నారు.

నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ….అక్షర సినిమాను ఇంకా త్వరగా రిలీజ్ చేయాల్సింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 24 అక్షర మీ ముందుకు రావాల్సింది. సినిమా హాల్ ఎంటర్ టైన్ మెంట్స్ అని బ్యానర్ పెట్టి ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా అని అనుకున్నాం. కానీ అక్షర సినిమాను ఖచ్చితంగా సినిమా హాల్లోనే చూపించాలని అన్ని కష్టాలు తట్టుకుని నిలబడ్డాం. అనుకున్నట్లే థియేటర్లోనే మీ ముందుకు వస్తున్నాం. నందితా శ్వేత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా ఇబ్బందుల్లో రిలీజైంది. ఆ సినిమా హిట్ అయ్యింది. అక్షర కూడా ఇబ్బందుల్లోనే రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నం. మమ్మల్ని ముందుకు నడిపించిన దర్శకుడు చిన్ని కృష్ణ గారికి థ్యాంక్స్. చైతన్య ప్రసాద్ గారు రాసిన అసులదర అనే పాట సినిమా ఏంటో చెప్పింది. మా ఈ చిన్న సినిమాను పెద్ద మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన కవిత గారికి, సాయి తేజ్ గారికి థ్యాంక్స్. రిలీజ్ కోసం మేము టెన్షన్ పడుతున్నప్పుడు దిల్ రాజు గారు, శిరీష్ గారు మాకు అండగా నిలబడి సినిమా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వారికి రుణపడి ఉంటాము. అన్నారు.

సుప్రీమ్ హీరో సాయి తేజ్ మాట్లాడుతూ...ఇక్కడికి వచ్చిన సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్. గెస్ట్ గా వచ్చిన ఎమ్మెల్సీ కవిత గారికి థ్యాంక్స్. ఈ సినిమా స్టార్ట్ అయి రెండేళ్లవుతోంది. అహితేజ నాకు ముందు నుంచీ టచ్ లో ఉండి సినిమా ప్రమోషన్ కు రావాలని కోరాడు. సినిమా టైమ్ లో అహితేజ టెన్షన్ లో ఉండేవాడు. కానీ అక్షర సినిమా రిలీజయ్యాక ఆయన టెన్షన్ తగ్గిపోతుంది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దర్శకుడు చిన్న కృష్ణ గారితో నాకు చాలా రోజులుగా తెలుసు. నా కెరీర్ స్టార్టింగ్ లో కథ చెప్పేందుకు వచ్చారు. 6 ఏళ్లుగా చిన్నకృష్ణ గారితో పరిచయం. ఎప్పుడు కలిసినా సరదాగా ఉంటుంది. నందితా చాలా బాగా నటించింది. ట్రైలర్ లో చూశాను. సీరియస్ టాపిక్ ఎంచుకుని చక్కగా నటించారు. నేను ఈ ఈవెంట్ కు రావడానికి కారణం ఈ సినిమా నిర్మాతలు మెగా ఫ్యాన్స్. నా ఫ్యాన్స్ నిర్మాతలు అయినప్పుడు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అది నా బాధ్యత. నేను కొంత డల్ గా కెరీర్ లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ అంతా అండగా ఉన్నారు. నేనూ వారికి సహకారం అందించాలనుకున్నాను. అక్షర సినిమాలో విద్య మన హక్కు, నాణ్యమైన విద్య పిల్లలకు అందాలి అని చెప్పారు. ఈ చిత్రంలో వినోదంతో పాటు సందేశం ఉంటుంది. అక్షరను థియేటర్లో చూడండి, మంచి సినిమాను ఆదరించండి. అన్నారు.

ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
కెమెరామాన్ : నగేష్ బెనల్, సంగీతం : సురేష్ బొబ్బిలి, ఎడిటర్ : జి.సత్య, ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి, కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు, లైన్ ప్రొడ్యూసర్స్ : గంగాధర్, రాజు ఓలేటి, పి.ఆర్.ఓ : జియస్ కె మీడియా, కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్ కొప్పు రావూరి, నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన – దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES