HomeTelugu‘లాయ‌ర్ విశ్వ‌నాథ్‌’ టీజర్ విడుద‌ల‌

‘లాయ‌ర్ విశ్వ‌నాథ్‌’ టీజర్ విడుద‌ల‌


స్టార్ క‌మెడియ‌న్‌గా, హీరోగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న అలీ క‌థానాయ‌కుడిగా న‌టించిన 53వ చిత్రం ‘లాయ‌ర్ విశ్వ‌నాథ్‌’. ర‌వికుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ మూకాంబిక ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బాల నాగేశ్వ‌ర రావు వ‌ర‌ద ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. వ‌ర‌ద నాగేశ్వ‌ర‌రావు, సూర్య వంత‌రం, ఎం.ఎన్‌.వి.సుధాక‌ర్ నిర్మాత‌లు. శుక్ర‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో టీజర్‌ను ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా..

సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ – ‘‘అలీ గారి లాంటి ఒక గొప్ప నటుడు ఇలాంటి ఒక మంచి సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఉన్న ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అన్నారు.

దర్శక నిర్మాత బాల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ – ‘‘నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ గా పని చేయలేదు. ఫ‌స్ట్ టైం ఈ సినిమాతోనే మెగాఫోన్ పట్టుకోవడం జరిగింది. అలీ గారిని కలిసి ఈ కథ చెప్పగానే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ప్రోత్సాహం వల్లే నేను ఈ రోజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనతో పాటు వారి కూతురు కూడా ఈ సినిమాలో నటించడం గొప్ప విషయం. జుబేరియా చాలా బాగా న‌టించింది. భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా న‌టిగా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన నా జీవితాంతం అలీ గారికి ఋణపడి ఉంటాను. లాయర్ విశ్వనాథ్ ఒక బలమైన కథతో తెరకెక్కించిన చిత్రం. శుభలేఖ సుధాకర్ జయలలిత గిరి లాంటి ఎంతో మంది సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో యాక్ట్ చేయడం జరిగింది. మాటలు, పాటలు చాలా బాగా కుదిరాయి. ఫిబ్రవరి 26న సినిమా చాలా గ్రాండ్ గా విడుదల అవుతుంది తప్పకుండా చూసి మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నటుడు గిరిధర్ మాట్లాడుతూ – “అలీ గారి సినిమాలతోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఆయన సినిమాలో ఒక మంచి పాత్ర చేయడం సంతోషంగా ఉంది. చాలా మంచి సబ్జెక్ట్. మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

అలీ కూతురు జుబెరియా మాట్లాడుతూ – “ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అంకుల్ కి చాలా థాంక్స్. ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేశారు. నా మొదటి సినిమాగా ఈ మూవీ ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతుంది” అన్నారు.

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “మేరు పర్వతానికి సమానమైన మంచి వ్యక్తిత్వం ఉన్న మహోన్నతమైన వ్యక్తి ఆలీ గారు. ఆయనతో దాదాపు నాకు 25 సంవత్సరాల అనుబంధం ఉంది. యమలీల సినిమా జరుగుతున్న సమయంలో కైకాల సత్యనారాయణ గారి ఇంట్లో నేను అలీగారు రెగ్యులర్ గా కలుస్తూ ఉండే వాళ్ళం. త‌ర్వాత త‌ను చాలా బిజీ అయ్యారు. అలీ గారు ఇప్పటివరకు 1120 సినిమాలు చేశారు. ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మంచి ఆశయంతో తీసిన ఈ సినిమా ఈ నెల 26న విడుద‌ల కానుంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను”అన్నారు

స్టార్ కమెడియన్, హీరో అలీమాట్లాడుతూ – “నాకు ఎనిమిది ఏళ్ల వ‌య‌సు ఉన్నప్పుడు నేను పరిశ్రమలోకి అడుగు పెట్టాను. ఇప్పుడు దాదాపు అదే వయసులో నా కూతురు కూడా ఈ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడం హ్యాపీగా ఉంది. మన దేశంలో ప్రస్తుతం నడుస్తున్న ఒక కొత్త పాయింట్ తీసుకుని ఒక‌ మంచి సినిమాని తెరకెక్కించారు దర్శకుడు బాల నాగేశ్వరరావు. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫిబ్ర‌వ‌రి 26 న విడుదల అవుతున్న సినిమా చూసి ప్రతి ఒక్కరూ కొత్త వారిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Pro;Mohan Tummala

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES