ప్రముఖ దర్శకుడు `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి లక్ష్మీ పార్వతి ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్నిమంతెన నరసింహరాజు (చిలుకూరు) సమర్పణలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి5న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలకి, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి `ఎవడే` సాంగ్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
`అందాలరాముడులాంటి బంగారు బుల్లోడే.. మందారం బుగ్గే మీటి ముద్దాడే సిన్నోడే. ఎవడే నా కోసం వరుడైపుట్టిన వాడు ఎవడే.. నా కోసం ఆశగా వేచిన వాడు ఎవడే..నా కథకే నాయకుడయ్యే పిల్లాడు..బూచాడు ఎవడే..ఈ బోమ్మకు రంగులు అద్దేవాడు ఎవడే..` అంటూ ఆహ్లాదంగా సాగే ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా లిప్సిక భాష్యం, మోహనబోగరాజు అంతే అందంగా ఆలపించారు. ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ అద్బుతమైన ట్యూన్‌ని కంపోజ్ చేశారు. ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత పుప్పాల సాగరిక కృష్ణకుమార్ మాట్లాడుతూ – “మా `రాధాకృష్ణ` చిత్రం నుండి ఎం.ఎం. శ్రీలేఖ గారి సంగీత సారథ్యంలో ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ సూపర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన `ఎవడే` సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్నివరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్), లక్ష్మీ పార్వతి, అలీ, కృష్ణ భగవాన్, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేందర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, ఎడిటింగ్: డి. వెంకటప్రభు, ఆర్ట్: వి. ఎన్ సాయిమణి, కో- ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కానూరు, సమర్పణ: మంతెన నరసింహరాజు (చిలుకూరు), నిర్మాణ సారథ్యం: కృష్ణ కుమార్, నిర్మాత: పుప్పాల సాగరిక కృష్ణకుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: శ్రీనివాస రెడ్డి, దర్శకత్వం: టి.డి.ప్రసాద్ వర్మ.