“మిస్టర్ అండ్ మిస్” ఒక బ్యూటిఫుల్ మూవీ – హీరోయిన్ జ్ఞానేశ్వరి కండ్రేగుల

1312

జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా అశోక్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం మిస్టర్ & మిస్ .ఈ చిత్రం ఈనెల 29 న విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర హీరోయిన్ జ్ఞానేశ్వరి కండ్రేగుల పాత్రికేయులతో ముచ్చటించారు. ..

జ్ఞానేశ్వరి కండ్రేగుల మాట్లాడుతూ…నా స్కూల్ డేస్ కొద్ది రోజులు కలకత్తాలో జరిగినా నేను వైజాగ్ అమ్మాయిని. మా ఫ్యామిలీ లో అందరూ స్టేట్ టాప్ ర్యాంకర్స్, ఐఐటి, లలో చదివిన ఫ్యామిలీ నుండి వచ్చాను. నేను కూడా ఐఐటి,ఐ. యమ్,ఎంబీఏ చదవాలనే డ్రీమ్ ఉండేది. నాకెప్పుడూ ఫ్యాషన్స్, మోడలింగ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండేది ఎంబీఏ ప్రిపేర్ అవుతూ లాక్మే ఫ్యాషన్ వీక్, మ్యాక్స్ ఫెస్టివల్స్ లలో వాక్ చేశాను. ఇలా నేను ఎంబీఏ ప్రిపేర్ అయ్యే టైంలో నా క్లోజ్ ఫ్రెండ్ ఒక షార్ట్ ఫిలిం లో చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు సినిమాల మీద, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేక నో చెప్పాను. ఓన్లీ వన్ డే షూట్ అని రిక్వెస్ట్ చేస్తే సరేనన్నాను. చిన్నప్పటి నుండి నేను మూవీస్ సరిగ్గా చూడలేదు, యాక్టింగ్ అంటే కూడా నాకు మినిమం నాలెడ్జ్ లేదు, అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ మేరకు నో చెప్పలేక “తను” అనే షార్ట్ ఫిలింలో నటించాను. ఆ తర్వాత ఈ షార్ట్ ఫిలింకు బాగా పేరొచ్చింది. సుమారు 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అక్కడి నుండి నాకు చాలా వర్క్ ఆఫర్స్ వచ్చాయి.

షాట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ మూవీస్ లలో ఆఫర్లు వచ్చినా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేక చదివే నా డ్రీమ్ అనుకొని నేను చేయలేదు. నా లైఫ్ లో మొదటిగా చేసిన, చూసిన షార్ట్ ఫిలిం “తను” నే అంతకు ముందు నాకు షార్ట్ ఫిలిం అంటే కూడా తెలియదు. “తను” షార్ట్ ఫిలిం తర్వాత నాకు ఒకతను నా ఫేస్ బుక్ లో విజయ్ దేవరకొండ సినిమాలో మిమ్మల్ని అనుకుంటున్నామని ఒక టెక్స్ట్ మెసేజ్ పంపారు. అది నేను నమ్మక ఇదంతా ఫేక్ అని నేను డిలే చేశాను. అయితే నాకు ప్రియదర్శన్ ఫ్రెండ్ అవడంతో ఆయనకు ఫోన్ చేసి క్లారిఫై చేసుకుంటే అతను వెంటనే నీకు వచ్చింది కరెక్టే అందులో ఆఫర్ వస్తే నువ్వు నో చెప్పకుండా కళ్ళు మూసుకుని ఒకే చెప్పమని సలహా ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికే నేను చాలా డిలే చేయడం జరిగింది. ఇది రియల్ అని తెలుసుకున్న వెంటనే నేను డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ గారికి కాల్ బ్యాక్ చేసి వారి ఆఫీసుకు వెళ్లి ఆడిషన్స్ లాగా యాక్టింగ్ డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి ప్రమోషన్లలో బిజీగా ఉండటం వలన డియర్ కామ్రేడ్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఫోన్ చేసిన గ్యాప్ లోఅర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి బిగ్ హిట్ అవ్వడం జరిగింది.

అయితే అంతకుముందు డియర్ కామ్రేడ్ లో కొత్త ఆర్టిస్టు లతో చేద్దామనుకున్న వారు కాస్త అర్జున్ రెడ్డి హిట్టవడంతో కొత్త వారితో కాకుండా సీనియర్ యాక్టర్స్ ను తీసుకోవడం జరిగింది. మొదటిసారి వారు నన్ను అడిగిన వెంటనే డిలే చేయకుండా ఉంటే నా మొదటి సినిమా డియర్ కామ్రేడ్ అయ్యుండేది. అయినా నో ప్రాబ్లం “మిస్టర్ అండ్ మిస్” కూడా ఒక బ్యూటిఫుల్ ఫిలిం. నేను”లవ్ జంట” షార్ట్ ఫిలిం చేస్తున్న క్రమంలో అశోక్ గారు కలసి నాకు “మిస్టర్ అండ్ మిస్” డెమో ఫిలిం గురించి చెప్పారు. ఆ తర్వాత అనుకోకుండా టెలివిజన్ షో పెళ్లిచూపులకు కూడా వెళ్లడం జరిగింది. అయితే మేము అశోక్ గారి తో చేసిన డెమో మిస్టర్ అండ్ మిస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది దీనికి 3 ఫిలిం ఫెస్టివల్స్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా నాకు రావడం జరిగింది అలాగే సైమా అవార్డ్స్ లో మా డెమో ఫిల్మ్ కు బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్స్ అవార్డ్స్ వచ్చాయి. అశోక్ గారు దీన్ని ఫీచర్ ఫిల్మ్ గా చేద్దామని చెబితే చేద్దామని స్టోరీ చెబితే ఇందులో రొమాన్స్ ఎక్కువ ఉందని నో చెప్పడం జరిగింది.

నేను నో చెప్పానని ముంబై నుంచి వేరే అమ్మాయితో షూట్ స్టార్ట్ చేశారు. అయితే నేను నెల వరకు బాగా ఆలోచించి ఈ అవకాశం మిస్ చేసుకుంటున్నానేమో అని కాల్ చేసి ఓకే చెబితే వెంటనే తీసుకున్న అమ్మాయిని క్యాన్సల్ చేసి నన్ను హీరోయిన్ తీసుకున్నారు. ఈ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఉందనుకొన్న టైంలో క్రౌడ్ సపోర్టుతో 80 నుంచి 100 మంది వరకు మాకు సపోర్ట్ చెయ్యడానికి ముందుకు రావడంతో దీన్ని క్రౌడ్ ఫండెడ్ మూవీగా చేయడం జరిగింది.సపోర్ట్ చేసిన వారికి నా ధన్యవాదాలు. చాలామంది క్రౌడ్ ఫండెడ్ మూవీ అంటే ఆర్ట్ ఫిలిం అనుకుంటారు. కానీ ఇది అందరికీ నచ్చే బ్యూటిఫుల్ కమర్షియల్ లవ్ స్టోరీ. ఇందులో నేను శశి అనే క్యారెక్టర్ చేశాను. ముంబై కంపెనీలో హెచ్ఆర్ గా చేసే నేను హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ రావడం, ఇక్కడ అమలాపురం నుండి ఇంగ్లీష్ కూడా అలానే అబ్బాయి ని కలవడం, క్లాస్ కల్చర్ నుండి వచ్చిన నేను, విలేజ్ కల్చర్ నుండి వచ్చిన అబ్బాయికి ఇంగ్లీష్ కూడా నేర్పి, ఆ అబ్బాయితో నా జర్నీ ఎలా స్టార్ట్ చేస్తూ తనతో లివింగ్ రిలేషన్ లో ఉండడం జరుగుతుంది.అయితే వారిద్దరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇద్దరికీ సెట్ అవ్వక బ్రేకప్ అయ్యే టైంలో వారి ఫోన్ మిస్ అవ్వడం, ఆ ఫోన్లో వారి ప్రైవసీ కి సంబంధించిన వీడియోస్ ఉండడం,అయితే పోయిన ఫోన్ దొరికిందా లేదా, ఫోన్ ఎలా పోయింది, ఒకవేళ హీరోనే ఫోన్ తీశాడా , ఎవరైనా బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారా.. అనేది ఈ సినిమా కథ మేము చేసిన డెమో లో ఓన్లీ టూ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి.

అయితే ఇందులో రెండు క్యారెక్టర్స్ ఎలా కలిశారు వారి ప్రయాణం ఎలా సాగింది అనేది తెలియజేస్తూ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ ని టచ్ చేస్తూ ఈ మూవీ అద్భుతంగా చేయడం జరిగింది ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ నాగ్, టెక్నీషియన్స్ టీమ్ అందరూ కూడా ఈ సినిమాకు ద బెస్ట్ ఇచ్చారు ఈ మూవీకు నా కో ఆర్టిస్ట్ సన్నీ కూడా 40 షార్ట్ ఫిలిం చేసిన ఆయన దగ్గర నేను యాక్టింగ్ మేలుకవలు నేర్చుకున్నాను.అశోక్ గారు “ఓ స్త్రీ రేపు రా” మూవీ ని ఎంత మొండిగా తీసి రిలీజ్ చేశారో , అంతే మొండిగా ఈ మూవీ ని తీసి రిలీజ్ చేస్తున్నారు. అశోక్ గారు వర్క్ చూసి తను ఏంతో నేర్చుకున్నాము. మా ఫ్యామిలీ లో ఎవరికీ సినిమా బ్యాక్ డ్రాప్ లేదు అలాంటిది నేను హీరోయిన్ అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు నా ఫ్యామిలీ మాకు ఫుల్ సపోర్ట్ చేశారు ఈ మూవీ తర్వాత నాకు కన్నడలో తెలుగులో, ఓ.టి టి లో ఆఫర్స్ వచ్చాయి అవి త్వరలో తెలియ జేస్తాన.ఈ నెల 29న అనగా రేపు విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతుంది. ఆ చిత్రం చూసిన ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆదరించి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

PRO.;GSK MEDIA