సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలై ప్రేక్షకుల నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే, సక్సెస్‌టూర్‌కు వెళిన సందీప్ కిషన్, హీరోయిన్ అన్యా సింగ్, ఇతర టీమ్ సభ్యులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. శనివారం సాయంత్రం ఈ సినిమా థాంక్యూ మీట్ నిర్వహించారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ “వెంకటాద్రి టాకీస్‌లో ఈ విజయానికి నేను ముఖ్యంగా వేంకటేశ్వర స్వామికి థాంక్స్ చెప్పుకోవాలి. విడుదలకు ముందు రోజు గురువారం రాత్రి తిరుమల వెళ్లాను. శుక్రవారం ఉదయం నా దర్శనం. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశా. ఒంటిగంటన్నరకు ఫోన్ ఆన్ చేస్తే రిజల్ట్ తెలుస్తుందని అనుకున్నాను. సాధారణంగా మూడు, నాలుగు గంటలకు నా సినిమా రిజల్ట్ నాకు తెలుస్తుంది. అంటే… ఆడుతుందా? లేదా? అని. ఇప్పటివరకూ చూస్తే… నిజాయతీగా నేను ఫలితం గురించి చెప్పేశా. ఆడకపోతే ఆడలేదని, ఆడితే ఆడిందని. ‘నిను వీడని నీడను నేనే’ విషయానికి వస్తే… మూడు గంటలకు నాకు అర్థం కాలేదు. పరిస్థితి ఏంటని. అందరూ బావుందంటున్నారు. రివ్యూలు బావున్నాయి. కానీ, నేను కన్వీన్స్ కాలేదు. ఊరికే నెత్తికి ఎక్కించుకోకూడదు. హిట్టా? కాదా? అని కరెక్టుగా అర్థం చేసుకోవాలని అనుకున్నా. ఆరు గంటలకు ఫోనులు రావడం స్టార్ట్ అయింది. నిజంగానే సందీప్‌కి హిట్ పడిందా? అని ఆలోచించి, టైమ్ తీసుకుని, అర్థం చేసుకుని అందరూ ఫోనులు చేశారు.
నిర్మాత దయా పన్నెం మాట్లాడుతూ “మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. నిర్మాతగా మా తొలి సినిమా ఇది. ఇంత పెద్ద సక్సెస్ రావడం సంతోషంగా ఉంది. గుడ్ స్టార్ట్ మాకు. ఈ సినిమాకు హీరోగా, నిర్మాతగా సందీప్ కిషన్ 100 శాతం కష్టపడ్డాడు. నాది ఏం లేదు. సీతారామ్, శివ చెర్రి రాత్రిపగలు కష్టపడి పనిచేశారు. వాళ్లు లేనిదే సినిమా లేదు. తమన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో కీలకమైన పాటను ఈ రోజు విడుదల చేశాం కదా. ఈ ఎమోషనల్ సాంగ్ ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంది. అన్యా సింగ్‌కు మరన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. వస్తాయి. వెంకటాద్రి టాకీస్‌లో మంచి కంటెంట్‌తో సినిమాలు నిర్మిస్తాం” అని అన్నారు.
నిర్మాత సుప్రియ మాట్లాడుతూ “తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు థాంక్స్. ఈ సినిమాలో మమ్మల్ని ఓ భాగం చేసిన సందీప్ కిషన్ కి థాంక్స్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్” అని అన్నారు.
హీరోయిన్ అన్యా సింగ్ మాట్లాడుతూ “మా చిత్రాన్ని, నన్ను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. తెలుగు సినిమా పరిశ్రమలోకి నాకు మంచి స్వాగతం లభించింది. సినిమా విడుదలైన తరవాత చాలా థియేటర్లకు వెళ్లాం. ప్రతిచోట స్పందన అద్భుతంగా ఉంది. ప్రేక్షకులు ఎంతో ప్రేమను చూపించారు. సందీప్ కిషన్, ప్రమోద్, దయా, సుప్రియ, సీతారామ్, శివ చెర్రి ఎంతో కష్టపడ్డారు ” అని అన్నారు.