ఒక సినిమా ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్లాలంటే దానికి టైటిల్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రేక్షకుల నానుడిగా వుండే టైటిల్స్ ఎప్పూడూ ఇట్టే ఆకట్టుకుంటాయి. కె సీరీస్ మూవి ఫ్యాక్టరి బ్యానర్ లో క్రిష్ సమర్పణలో మురశి శర్మ, దేవ్‌గిల్ ప్రధానపాత్రలో బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రానికి టైటిల్ గా రావణ లంక అని ఖరారు చేశారు. క్యాచి గా వుండే ఈ టైటిల్ అందర్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో క్రిష్, అష్మిత, త్రిష లు జంటగా నటించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓక సాంగ్ మినహ షటింగ్ పూర్తిచేసకుని పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రం యెక్క మెదటి లుక్ ని మరియు మెషన్ పోస్టర్ ని ఈ రోజు విడుదల చేశారు.
దర్శకుడు బి.ఎన్.ఎస్ రాజు మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రికి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా మా రావణ లంక చిత్రం రానుందని గర్వంగా చెప్తున్నాను. ఇలాంటి చిత్రాలకి స్క్రీన్‌ప్లే మెయిన్ పార్ట్ గా వుంటాయి. మా చిత్రం లో కూడా ప్రతి ఒక్కరూ తల తిప్పకుండా చూస్తారు. మురశి శర్మ గారు, దేవ్‌గిల్ గారు చాలా పెద్ద ఎస్పెట్ మాకు… అలాగే భద్రం, రచ్చరవి కామెడి టైమింగ్ కూడా స్క్రీన్ మీద నవ్వుకుంటారు. అలాగే కొత్త వారైనా క్రిష్ చాలా బాగా చేశాడు. అష్మిత, త్రిష లు ఈ థ్రిల్లింగ్ మూవీకి గ్లామర్ అందించారు. ఉజ్జల్ అందించిన సంగీతానికి బిగ్‌బాస్ సీరీస్3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌మరియు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కుమారుడు కాలభైరవ వారి వాయిస్ తో ఆడియో కి క్రేజ్ తీసుకువచ్చారు. అతి త్వరలో ఈ ఆడియో ని విడుదల చేస్తాము. ఈ చిత్రం తప్పకుండా అందర్ని ఆకట్టకుంటుంది. అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సమ్మర్ కానుకగా విడుదల చేస్తాము. అని అన్నారు
నటీనటులు.. క్రిష్, సందీప్,అష్మిత, త్రిష, మురళి శర్మ, దేవ్‌గిల్, రచ్చరవి, భద్రం తదితరులు నటించగా
బ్యానర్.. కె సీరీస్ మూవీ ఫ్యాక్టరి
సమర్పణ.. క్రిష్
మ్యూజిక్.. ఉజ్జల్
కెమెరా.. హజరతయ్(వలి)
స్టంట్స్.. నందు, మల్లేష్
సింగర్స్.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ
ఎడిటర్.. హరీష్
లిరిక్స్.. భాషాశ్రీ
నిర్మాత.. క్రిష్
స్టోరి-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం… బి.ఎన్.ఎస్ రాజు