కె.సి.బొకాడియ…చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎందరో స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఫాస్ట్‌గా 50 సినిమాలు కంప్లిట్ చేసిన ఫిలిం మేకర్‌గా రికార్డ్ సాధించిన బాలీవుడ్ పాపులర్ ఫిలిం మేకర్. లేటెస్ట్‌గా లలిత్ మోడీ, గౌతమ్‌చంద్ రాథోర్ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నమస్తే నేస్తమా’. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్‌బస్టర్‌హిట్ సాధించిన ‘తేరి మెహర్భానియా’ చిత్రానికి పార్ట్-2 వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు. రెండు కుక్కలు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో
ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. హీరో శ్రీరామ్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు. జనవరి 3న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా..హైదరాబాద్ ది ప్లాజా హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపులర్ ఫిలిం మేకర్ కె.సి.బొకాడియ, చిత్ర సమర్పకులు గౌతమ్ చంద్ రాథోర్, రాజ్ కుమార్ బొకాడియ పాల్గొన్నారు..
పాపులర్ ఫిలిం మేకర్ కె.సి. బొకాడియ మాట్లాడుతూ – ”రాజస్థాన్ లోని చిన్న గ్రామం నుండి వచ్చి బొంబాయిలో ఉన్న హైకాంపిటేషన్‌ని తట్టుకొని 1972లో మొదటి సారి సంజీవ్ కుమార్‌తో ‘రివాజ్’ సినిమాను నిర్మించడం నేను ఎప్పటికి మర్చిపోలేను.