విక్టరీ వెంకటే్‌శ్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 13న సినిమా విడుదలవుతుంది. మంగళవారం ఈ సినిమా మ్యూజికల్ నైట్ జరిగింది. ఈ సందర్భంగా …
రానా దగ్గుబాటి మాట్లాడుతూ – “ఈరోజు మా తాతగారు ఉండుంటే చాలా హ్యాపీగా ఉండుండేవారు. చిన్నాన్నతో, చైతన్యతో సరదాగా ఉండేవారు. నన్ను మాత్రం పక్కకు తీసుకెళ్లి తిడుతుండేవారు. చైతు నాకంటే చిన్నోడు.. నాకంటే అన్ని ముందు చేసేస్తుంటాడు. నాకంటే కాలేజ్ ముందు పాసైయ్యాడు. నాకంటే ముందు పెళ్లి చేసుకున్నాడు. చిన్నాన్నతో సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఇక వెంకీ మామ సినిమా విషయానికి వస్తే.. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌కి ఇది స్పెషల్ మూవీ. 55 సంవత్సరాల్లో ఇదొక మైల్ స్టోన్. దీన్ని ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను“ అన్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ – “నాకు ఎమోషనల్‌గా ఉంది. వంద సినిమాలు చేసిన నిర్మాతగానే కాదు.. దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు చేసిన నిర్మాత ఎవరైనా ఉన్నారా? అంటే ఆ ఘనత రామానాయుడుగారికే దక్కుతుంది. మా దర్శకులందరికీ దేవుడాయన.అన్నారు
నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ – “వెంకటేశ్, రానా, చైతులు కలిపి నాన్నగారు ఓ సినిమా చేయాలనుకునేవారు. ఈ సినిమా బంధాలు, అనుబంధాల గురించి చెప్పే సినిమా. కె.ఎస్.ప్రకాశ్‌రావుగారు మా నాన్నగారితో మంచి స్నేహాన్ని కొనసాగించారు. ఆయన చేసిన ప్రేమ్‌నగర్ సినిమాలు మా జీవితాలను మార్చివేసింది అన్నారు