సంజనా ఫిలింస్ బేనర్‌పై లయన్ గిరి పయ్యావుల నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ఉర్వి. న్యూ ఏజ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కిరణ్.వై దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహేష్,శృతి శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి లక్ష్మణ సాయి సంగీత దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాడు చేసిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ట గౌడ్, నవీన్ యాదవ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…
ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ఈ సినిమా నిర్మాత గిరి పయ్యావుల నాకు చాలా మంచి సన్నిహితుడు..అతి తక్కువ సమయంలోనే సినిమా పూర్తి చేసి రిలీజ్‌కి తీసుకువచ్చాడు. ఇదే బేనర్లో మరో మూవీ నిర్మాణ దశలో ఉంది. ఈ మధ్యకాలంలో కథకు ప్రధాన్యమిచ్చిన సినిమాలు బాగా ఆడుతున్నాయి. మంచి కంటెంట్‌తో సినిమా తీసి అవసరమైన ప్రమోషన్స్ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఉర్వి సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి. ఈ రోజు ఉర్వి లాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నవీన్ యాదవ్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా వారు కూడా చిన్న సినిమాలను కాస్త ఎక్కువ పబ్లిసిటీ చేసి నూతన దర్శక, నిర్మాతలకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
నవీన్ యాదవ్ మాట్లాడుతూ – `ఒక చిన్న సినిమాకు సపోర్ట్ చేయాలనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలకి కూడా కథా బలమున్న చిన్న సినిమాలు పోటీనిస్తున్నాయి. జనాలు ఇష్టపడేలా సినిమాలు తీస్తే తప్పకుండా ప్రతీ మూవీ సక్సెస్ అవుతుంది. సంజనా ఫిలింస్ లో వస్తోన్న ఉర్వి ట్రైలర్ చూశాను బాగుంది. మూవీ కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇలానే మంచి కాన్సెప్ట్, మంచి సబ్జెక్ట్స్‌తో ఈ బేనర్ నుండి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్` అన్నారు.
గిరి పయ్యావుల మాట్లాడుతూ – మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతాని రామకృష్టా గౌడ్ గారికి, నవీన్ యాదవ్ గారికి ధన్యవాదాలు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ చాలా ఉత్కంఠంగా సాగుతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి మా హీరో మహేష్‌గారు మరియు ఎడిటర్గారే కారణం. సెన్సారు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు కిరణ్.వై మాట్లాడుతూ – “ సంజనా ఫిలింస్‌లో ఫస్ట్ మూవీ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు బీజం వేసింది మా హీరో మహేష్ అయితే ఎలాంటి సమస్య రాకుండా పూర్తి చేసింది మాత్రం మా నిర్మాత గిరి పయ్యావుల గారు. ఆయన లేకపోతే మేం ఎవ్వరం లేము..డీఓపి యాదగిరి గారు, సంగీత దర్శకుడు ఎడిటర్ చాలా సపోర్ట్ చేశారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన ఫస్ట్ హారర్ ఫిలిం..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక అంశాన్ని తీసుకుని ఈ సినిమా తీయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
నటుడు మహేష్ మాట్లాడుతూ – దర్శకుడు కిరణ్ నా స్నేహితుడు..ఒక మంచి హారర్ కాన్సెప్ట్ అనుకుని సినిమా చేద్దాం అనుకున్నాం..కాని నేను మెయిన్ లీడ్‌గా చేయడానికి మాత్రం మా ప్రొడ్యూసర్ గిరి పయ్యావుల గారు ముఖ్య కారణం. అంతా కొత్త వాళ్లం అయినా ఆయనే ధైర్యం చేసి ప్రొడ్యూస్ చేశారు. మా టీం అందరికీ `ఉర్వి బెస్ట్ డెబ్యూ మూవీ అవుతుందని నమ్ముతున్నాం`అన్నారు.
సంగీత దర్శకుడు లక్ష్మణసాయి మాట్లాడుతూ – ఈ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. చక్కగా చిత్రీకరించారు. హారర్ సినిమా అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో పాటలు, ఆర్ ఆర్ చక్కగా కుదిరింది. సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.