“ఆధిపత్యం కోసం ఆశ పుట్టిన ప్రతిచోటా చిన్నదో పెద్దదో ఒక యుద్ధమైతే జరగాల్సిందే “… అలాంటి యుద్ధాలు నిత్య కృత్యంగా జరిగే జాలర్ల జీవిత నేపథ్యంలో రూపొందిన యాక్షన్ కల్ట్ ఫిలిం “రేవు”. సముద్రంలోని మత్స్య సంపద మీద ఆధిపత్యం కోసం జరిగే పోరాటాన్ని చాలా వాస్తవికంగా తెరకెక్కించిన యువ దర్శకుడు హరినాథ్ పులిచర్లను మనస్ఫూర్తిగా అభినందించారు ప్రముఖ నటులు, నిర్మాత మురళీమోహన్. ఏ. ఆర్. ఫిలిం టీమ్ మరియు విజయ టాకీస్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ‘రేవు’ చిత్రం పోస్టర్ అండ్ టీజర్ లను ఆవిష్కరించారు మురళీమోహన్.
ఈ సందర్భంగా రేవు యూనిట్ ను అభినందిస్తూ.. ‘చేపల వేటయే జీవనోపాధి అయిన జాలర్ల జీవిత నేపథ్యంలో రూపొందిన చిత్రం రేవు. ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో తీశాడు యువ దర్శకుడు హరినాథ్. ఇందులో యాక్షన్, సెంటిమెంట్, మేకింగ్ స్టైల్, లొకేషన్స్ వంటి అన్ని అంశాలు చాలా బాగున్నాయి. కొత్త వాళ్ళందరూ కలిసి ఎంతో తపనతో తీసిన చిత్రమిది. ఇలాంటి చిన్న సినిమాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే వీళ్లకు అండదండగా నిలిచిన సీనియర్ జర్నలిస్టు ప్రభు అడిగిన వెంటనే రేవు పోస్టర్ అండ్ టీజర్ రిలీజ్ చేయడానికి నేను అంగీకరించాను. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తూ రేవు యూనిట్ మొత్తానికి నా అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను’ అన్నారు మురళీమోహన్.
చిత్ర దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ.. ‘మత్స్యకారుల జీవితంలోని ఆటుపోట్లను కథాంశంగా తీసుకుని చేసిన కల్ట్ ఫిలిం రేవు. ఎంతో కష్టపడి తీసిన మా చిత్రంలోని కంటెంట్ వెయిట్ ను గమనించి మా ప్రయత్నాన్ని అభినందించి, ఆశీర్వదించి పోస్టర్, టీజర్ లను రిలీజ్ చేసిన పెద్దలు మురళీమోహన్ గారికి, మాకు అన్ని విధాల సపోర్ట్ గా నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి కృతజ్ఞతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ తో సిద్ధంగా ఉన్నాం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మా ‘రేవు’ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం’ అన్నారు.
అందరూ నూతన నటీనటులతో రూపొందిన రేవు చిత్రంలో హీరోగా వంశీ రాం, హీరోయిన్ గా స్వాతి భీమ్ రెడ్డి నటించగా ఇతర ప్రధాన పాత్రల్లో హరిబాబు ఏపూరి, ఆంటోనీ అజయ్, హేమంత్ ఉద్భవ్, విశ్వనాథన్, లీలా వెంకటేష్ కొమురి, గురుతేజ్, స్వీటీ తదితరులు నటించగా ప్రముఖ హాస్య నటులు, రచయిత, దర్శకుడు ఎల్బీ శ్రీరామ్ అతిథి పాత్రలో నటించారు. కాగా ఈ చిత్రానికి పాటలు: జాన్ కె జోసెఫ్, గీత రచయిత: ఇమ్రాన్ శాస్త్రి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: వైజాగ్ మురళీధరన్, కొరియోగ్రఫీ: వినోద్, ఛాయాగ్రహణం: రేవంత్ సాగర్, ఎడిటర్స్: శివ సర్వాణి, శశికిరణ్ తుమ్మటి, ఆర్ట్: బాషా, విఎఫ్ఎక్స్: శ్రీహరి సురేష్
రచన – దర్శకత్వం: హరినాథ్ పులి.