రాజారెడ్డి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎఫ్ అండ్ ఆర్ సమర్పణలో సురేష్ తిరుమూర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం లైఫ్ అనుభవించు రాజా. రాజారెడ్డి కందాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూతన నటీనటులు జూనియర్ రవితేజ, శృతిశెట్టి, శ్రావణినిక్కి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకుని శుక్రవారం ప్రసాద్‌ల్యాబ్స్‌లో ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతులు మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల అయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…
రాజ్‌కందుకూరి మాట్లాడుతూ… ప్రతి ఒకళ్ళ లైఫ్‌లో ఏదో ఒక టైంలో ఎంజాయ్ చెయ్యాలనుకుంటారు. ఎప్పుడూ నిర్మాత అనేవాడు బ్యాక్‌బోన్ ఆఫ్ ద ఫిల్మ్. ముందుగా నేను హోల్ హార్టెడ్ ఐ ఎప్రిషియేట్ ఈ చిత్ర నిర్మాత అయిన రాజారెడ్డిగారు. చిన్న సినిమాలు ఈ టైంలో రిలీజ్ చేసే టైం. ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మాట్లాడుతూః నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు బిగ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అని అన్నారు.
హీరో రవితేజ మాట్లాడుతూఃఈ మూవీలో ఛాన్స్ నాకు ఆడిషన్ ద్వారా వచ్చింది. నాకు సురేష్‌గారు ఒకరోజు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ట్రైలర్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను సినిమా కూడా మీ అందరికి నచ్చుతుంది. మీరందరూ చూసి తప్పకుండా ఆదరించాలి అని అన్నారు.
దర్శకుడు తిరుమూరు మాట్లాడుతూః నేను ఒక కథ పట్టుకుని చాలా ఆఫీసులు తిరిగాను. కానీ అవకాశాలు రాలేదు. ఒక రోజు కథ విని మా మేనబావ ప్రొడ్యూస్ చేశారు. ఆడియన్స్‌కి బోర్ కొట్టకుండా రెండు గంటలు ఎంటర్‌టెయిన్ చెయ్యాలని ఇది గ్యారెంటీగా మంచి సినిమా అవుతుంది. రాజారెడ్డి మా మేనబావ ఆయన ఇంప్రస్ అయి ముందుకు వచ్చి ఈ సినిమాని తీశారు. ఒక్కరోజు కూడా షూటింగ్ స్పాట్‌కి రాలేదు. నన్ను ఎంతో బాగా ఎంకరేజ్ చేశారు. డబ్బులు విషయంలో కూడా ఎక్కడా వెనకాడకుండా తీశారు అన్నారు.
నటీనటులుః రవితేజ, శ్రావణినిక్కి, శృతిశెట్టి, షాని, పవన్ నాగేంద్ర, రత్నాకర్, అనీలా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః రజనీ, మేకప్ఃసుమన్, మ్యూజిక్ఃరామ్, ఎడిటింగ్, సునీల్‌మహరాజ్, నిర్మాతఃరాజారెడ్డి కందుల, రచన దర్శకత్వంఃసురేష్ తిరుమూర్