HomeTeluguగీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణంలో రాహుల్...

గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణంలో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ ప్రకటన

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చి.ల.సౌ, మన్మథుడు 2 చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు.

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉన్నాయి. ‘నాదీ అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా…’ అంటూ మోషన్ పోస్టర్ వాయిస్ ఓవర్ లో వచ్చిన డైలాగ్స్, రశ్మిక శ్వాసను ఆపి నీటిలో కూర్చుని ఉండటం…మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

నటీనటులు – రశ్మిక మందన్న, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – వంశీ కాక, జీఎస్ కే మీడియా
మార్కెటింగ్ – ఫస్ట్ షో
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు – విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES