తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో త్వరలో కలియుగం అనే సినిమా రిలీజ్ కాబోతోంది. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ కాంతార ఫేమ్ కిషోర్ ఈ సినిమాలో పోటాపోటీగా నటించారు. ఈ సినిమా ఇప్పటివరకూ భారతీయ సినీ ఇండస్ట్రీ లో తెరకెక్కని అద్భుతమైన కథతో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనుంది.
2064 సంవత్సరంలో ఈ మానవాళికి ఏమవుతుంది ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అనే విషయాలను ఆధారంగా చేసుకుని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పోస్ట్ అపోకలిప్స్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను నిర్మింప చేశారు. భారీస్థాయిలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో బిజీగా ఉంది. అద్భుతమైన గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయి మేకింగ్ ఈ సినిమాని మరో లెవల్ కు తీసుకు వెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ కె ఇంటెర్నేషనల్” బ్యానర్ లో కె ఎస్ రామకృష్ణ నిర్మించారు. అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎన్నో యాడ్స్ కి డైరెక్టర్ గా పనిచేసిన ప్రమోద్ సుందర్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసిన రామ్ చరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. నాలుగుసార్లు కేరళ ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న డాన్ విన్సెంట్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చేస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతున్న ఈ కలియుగం సినిమా సినీ ప్రేక్షకులను రంజింప చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే దాదాపుగా అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణ భారత భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
నటీనటులు :
కిషోర్ కుమార్ జి., శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య లక్ష్మి, ఇనియన్ సుబ్రహ్మణ్యం, సంతోష్
నిర్మాత: కె ఎస్ రామకృష్ణ
నిర్మాణ సంస్థ : ఆర్కే ఇంటర్నేషనల్
డైరెక్టర్: ప్రమోద్ సుందర్
సినిమాటోగ్రాఫర్: కే రామ్ చరణ్
సంగీత దర్శకుడు: డాన్ విన్సెంట్
కళా దర్శకత్వం: శక్తి వెంకట్‌రాజ్ ఎమ్
స్టంట్స్. జిఎన్ మురుగన్.