ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ కి ఘనంగా సన్మానం

195


జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ ని ఘనంగా సత్కరించాలని ప్రముఖ సినీ నటుడు శ్రీ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో I FLY STATION నిర్ణయించింది. ఈ నెల ౩౦ న సాయంత్రం 5:30 ని.లకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక లో కార్యక్రమం జరగనుంది. చంద్రబోస్ రచించిన గీతాల గురించి వారే స్వయంగా తమ మనసులోని మాటలను తెలియజేస్తూ , ఆ పాటను ప్రముఖ గాయనీ గాయకులు గీతామాధురి దీపు పి విఎన్ఎస్ రోహిత్, సత్య యామిని, అతిథి భావరాజు, సాయి చరణ్ లతో పాడించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరు కానున్నారు వారిలో మురళీ మోహన్ , హీరో శ్రీకాంత్, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, రచయిత రామ జోగయ్య శాస్త్రి, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ పాల్గొంటారు.

https://we.tl/t-vl6znk1yWn