సౌమ్య వడ్ల పట్ల సమర్పణలో మహేందర్ వడ్ల పట్ల, సన్నీ కునాల్, రాజేష్, అనూష, త్రివేణి నటీ నటులుగా మహేందర్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “తాంత్రికుడు”. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి చిత్ర యూనిట్ సమక్షంలో టీజర్ ను విడుదల చేశారు అనంతరం
తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చేర్మెన్ వేణుగోపాల్ చారి మాట్లాడుతూ .. వడ్లపట్ల కుటుంబం నుండి వచ్చిన రెండవ సినిమా తాంత్రికుడు. ఈ సినిమా టీజర్ బాగుంది. మహేందర్ వడ్లపట్ల అమెరికాలో ఉన్నా తెలుగు మీద మమకారంతో తీసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత యం.ఆర్.సి వడ్లపట్ల మాట్లాడుతూ..మహేందర్ కు చిన్నప్పటి నుండి నటన అంటే చాలా ఇష్టం.తనకు యాక్టింగ్ చేయాలని ఉన్నా బిజినెస్ లో బిజీగా ఉండడంతో 2000 సంవత్సరంలో లవ్ 2020 సినిమాను నిర్మించాడు. నటన పరంగా తన డ్రీమ్ ను నెరవేర్చాలనుకున్నా ఇప్పటివరకు టైం దొరకలేదు. చివరకు మా సంఘ కుమార్ ద్వారా తన డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు విడుదల చేసిన తాంత్రికుడు సినిమా టీజర్ చాలా బాగుంది. సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మహేందర్ కు మంచి పేరు రావాలి. ఇలాగే తను మరెన్నో సినిమాలు తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ… మా తాంత్రికుడు సినిమాకు మూల కారకుడు మా సంఘకుమార్. తను నా దగ్గరకు వచ్చి నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను. మీ బ్రదర్ ను నిర్మాతగా, దర్శకుడు గా, నటుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. తను చెప్పినట్టు ఈ సినిమాకు అన్నీ తానై చాలా సహాయ, సహకారాలు అందించాడు. మా బ్రదర్ మహేందర్ ఈ సినిమా చాలా బాగా తెరకెక్కించాడు. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీం అందరికీ బిగ్ హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శక,నిర్మాత, నటుడు మహేందర్ వడ్లపట్ల మాట్లాడు తూ…మంచి సినిమా తీద్దాం అని అమెరికా నుండి వచ్చిన నాకు మా అన్న ద్వారా సంఘకుమార్ పరిచయం అవ్వడం జరిగింది. తను ఈ సినిమాకు సపోర్ట్ చేశాడు.ఈ సినిమాకు నేను దర్శకుడు, నిర్మాతగా చెయ్యడమే కాకుండా తాంత్రికుడు పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.గోవాలో చేసిన సీన్స్ బాగా వచ్చాయి. నటీ, నటులు, టెక్నిషియన్స్ ఇలా టీం అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరో సన్నీ కునాల్ మాట్లాడుతూ.. ఇది మంచి హరర్ మూవీ.. ఈ సినిమాతో పాటు మూడు సినిమాలు చేస్తున్నా ఫస్ట్ రిలీజ్ అవుతున్న సినిమా తాంత్రికుడు.ఈ సినిమాకు సంఘకుమార్ గారు బ్యాక్ బోన్ లా ఉండి మాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా దర్శక, నిర్మాత మహేందర్ వడ్లపట్ల గారు మమ్మల్ని మోటివేషన్ చేసి మాతో చక్కటి నటనను రాబాట్టుకున్నారు. తన ద్వారా నటన పరంగా చాలా మెలుకువలు నేర్చుకున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన వీరికీ నా ధన్యవాదాలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
సంఘకుమార్ మాట్లాడుతూ… మంచి అభిరుచి ఉన్న వ్యక్తి మహేందర్.తను అమెరికా నుండి వచ్చి ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వాలనే కోరికతో మంచి హార్రర్, లవ్, ఎమోషన్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని అద్భుతమైన సినిమా తీశాడు. ఈ సినిమా ద్వారా తనకు మంచి పేరు వస్తుంది. అలాగే ప్రేమికులకు కూడా ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ దొరుకుతుందని కచ్చితంగా చెప్పగలను.అయితే మోహన్ వడ్లపట్ల గారిని నేను సొంత అన్నలా భావిస్తున్నందున వారి తమ్ముడు మహేందర్ తీస్తున్న ఈ సినిమాకు ప్రొడక్షన్ పరంగా, పోస్ట్ ప్రొడక్షన్ పరంగా ఆర్టిస్ట్ ల పరంగా నా వంతు కొంత సహాయ సహకారాలు ఇవ్వడం జరిగింది.టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.
నిర్మాత పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ.. ప్రస్తుత యంగ్ స్టర్స్ అందరూ కూడా హారర్ సినిమాలను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ తాంత్రికుడు సినిమా బిగ్ సక్సెస్ అవ్వాలని, అలాగే టీం అందరికీ మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఎలైట్ మీడియా అధినేత మురళి మోహన్ వేములపల్లి మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో తీసిన తాంత్రికుడు సినిమా టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
హీరోయిన్ అనూష మాట్లాడుతూ.. నేను చేస్తున్న మొదటి హారర్ చిత్రం ఇది. చూసిన ప్రేక్షకులకు మాత్రం మా తాంత్రికుడు సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
హీరోయిన్ త్రివేణి మాట్లాడుతూ… ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
నటీ నటులు
మహేందర్ వడ్ల పట్ల, సన్నీ కునాల్, రాజేష్, అనూష, త్రివేణి తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ : సౌమ్య వడ్ల పట్ల
బ్యానర్ : వడ్లపట్ల సినిమాస్
దర్శక, నిర్మాత: మహేందర్ వడ్లపట్ల
సంగీతం: కె. ఆనంద్
ఎడిటింగ్: మూత దేవేందర్
కెమెరా: వంశీ
సహ నిర్మాత : భబిత కాంబ్లె
పి. ఆర్. ఓ : మూర్తి