HomeTeluguకన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన "వేద" చిత్రం మోషన్ విడుదల

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన “వేద” చిత్రం మోషన్ విడుదల


కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో. ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం.

ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగు రిలీజ్ కు సిద్దమవుతుంది. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించింది చిత్ర బృందం.

నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ
ఈ సినిమాను కథ నచ్చి కొనుక్కున్నాను. ఒక మంచి సినిమాకి ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు బహ్మరథం పడతారు.ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు.కానీ నాకు అవకాశం దక్కింది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాము. శివ రాజ్ కుమార్ ఫ్యామిలీ కి మన తెలుగులో కూడా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మనం కూడా శివన్న అని పిలుచుకుంటాం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వాళ్ళు కూడా హాజరవుతారు.ఈ కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ ద్వారా త్వరలో మరిన్నీ గొప్ప సినిమాలను రిలీజ్ చేయబోతున్నాను.

ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించింది.శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించారు.

నటీనటులు: శివరాజ్ కుమార్ , ఘనవి లక్ష్మణ్

దర్శకత్వం : హర్ష
నిర్మాత : గీతాశివరాజ్‌కుమార్
సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ్
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
సంగీతం: అర్జున్‌జన్య
పి.ఆర్. ఓ: వి. ఆర్ మధు
డిజిటల్ మీడియా: ప్రసాద్ లింగం

Video link: https://we.tl/t-vgK32yexrK

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES