మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజ హెగ్డే హీరోహీరోయిన్లుగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళ హీరో అధర్వ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబర్ 20న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్న సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదిక లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విక్టరి వెంకటేష్ హాజరయ్యి ఆడియో బిగ్ సిడిని విడుదలచేశారు. ఈ సందర్భంగా…
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ – ”ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటినుండి నాతో ట్రావెల్ చేసిన మధు శ్రీనివాస్, మిధుల్ చైతన్య గారికి థాంక్స్. నాతో పాటు ఒక సంవత్సరం ట్రావెల్ అయ్యి స్క్రిప్ట్‌లో నాతో పాటు కూర్చున్నారు. వీరివర్క్‌కి ఇంప్రెస్ అయ్యి అడిషనల్ డైలాగ్స్ అని వీరి పేరు కూడా మీతో షేర్ చేసుకున్నా. మనకు నచ్చిన పాటల్ని షేర్ చేసుకోవడం ద్వారా మన కవిత్వాన్ని, మనసాహిత్యాన్ని కాపాడుకున్నవారం అవుతాము. ఐనాంక బోస్, మిక్కీ ఈ సినిమాకి రెండు పిల్లర్స్ లాంటి వారు. మిక్కీతో చేసిన ‘తెలుగంటే’ నా ఫేవరెట్ సాంగ్. మిక్కీ చేసిన ‘మహానటి’ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్బమ్. మిక్కీ పాటలు ఎంత హిట్ అయ్యాయో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకన్నా హైలెట్ అవుతుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ” ముందుగా ఈ గద్దల కొండ గణేష్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన మా సింగిల్ హ్యాండ్ గణేష్ విక్టరి వెంకటేష్ గారికి స్పెషల్ థాంక్స్. ‘వాల్మీకి’ నా తొమ్మిదో సినిమా… ఫస్ట్ మాస్ సినిమా. ఫస్ట్ టైమ్ ఒక మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరు. చిరంజీవి గారు ఎప్పుడూ చెప్తుండేవారు మేము మాస్ సినిమాలు ఎందుకు చేస్తామో నీకు అర్ధం కావడం లేదు మాస్‌లో ఒక పవర్ ఉంటుంది అని. ఇప్పుడు అర్ధం అయింది.