HomeTeluguఅంగరంగ వైభవంగా బాలుజయంతి వేడుక–సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌

అంగరంగ వైభవంగా బాలుజయంతి వేడుక–సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌

జూన్‌ 4వతేది బాలుగారి జయంతిని (77వ పుట్టినరోజు) పురస్కరించుకుని సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌ రవీంద్రభార తిలో ‘‘బాలుకి ప్రేమతో’’ అంటూ దాదాపు 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా యం.ఎల్‌.ఏ రసమయి బాలకిషన్, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌తో పాటు సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షలు ఆర్‌.పి పట్నాయక్, సీయంయు అధక్షురాలు, సినీ నేపధ్యగాయిని విజయలక్ష్మీ, వైస్‌ ప్రెసిడెంట్‌ జైపాల్‌రాజు, జనరల్‌ సెక్రటరీ రామాచారి, ట్రెజరర్‌ రమణ సీలం, జాయింట్‌ సెక్రటరీ ఆర్‌ మాధవి, ఈసి మెంబర్‌ ప్రముఖ సింగర్‌ కౌసల్య, సంగీత దర్శకుడు వసంత్, కుంచె రఘు, సింగర్‌ శ్రీరామచంద్ర, గీతామాధురీ, శ్రీకృష్ణ, ఘంటాడి కృష్ణ, సింగర్‌ సందీప్, బిందు,వసంత తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ–‘‘ మొన్న శివరాత్రికి వేములవాడ జాతర చూసినా, నిన్న సమ్మక్క–సారక్క జాతర చూసినా, నేడు బాలు పుట్టినరోజు జాతరను రవీంధ్రభారతీలో చూస్తున్నా. నేను పెరుగుతూ,పెరుగుతూ బాలు పాటలు వింటూనే పెరిగాను. అలాగే తెలంగాణా రాష్ట్రం కోసం విభజన కోసం ఓ పాట పాడారు. ఈ రోజు కె.సి.ఆర్‌ గారి నాయకత్వంలో సాంస్కృతిక శాఖలో 550 ఉద్యోగాలు కళాకారులకు దక్కాయి అని సగర్వంగా తెలియచేసుకుంటున్నా’’ అన్నారు. .

రచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ–‘‘ నేను రాసిన మొదటిపాట బాలుగారే పాడు. అలాగే నా మీద వస్తున్న ఓ పుస్తకానికి బాలుగారు ముందుమాట రాశారు. ఆ పుస్తకంలో నేను ‘‘ఆఖరి ముందుమాట’’ అని రాసుకున్నాను. బాలు గారి విషయంలో మరణం మనిషికే కానీ, మంచితనానికి కాదు. సినీ మ్యూజీషియన్స్‌లో కలిసి ఈ స్థాయికి వచ్చినవాణ్ని ఆ యూనియన్‌కి నా వంతుగా కొంత ఆర్థిక సాయం అందిస్తున్నా’’ అన్నారు. .

ఈ సందర్భంగా సినీ మ్యూజిషియన్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఆర్‌.పి పట్నాయక్‌ మాట్లాడుతూ– ‘‘ బాలు గారంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. ఎక్కడికి పోలేదు. ఆయన పాటలాగా మనందరితో ఎప్పుడూ ఉంటాడు. నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తిప్రధాత బాలు అన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES