క్రేజీ ‘ఆర్ఎక్స్100’ భామ పాయల్ రాజపుత్ ఒయ్యారాలు అంతా ఇంతా కాదట! టాలీవుడ్ లో ‘ఆర్ఎక్స్100’ తో యువతరాన్నే కాదు, చిత్రసీమనూ తనవైపునకు చూసేలా చేసుకున్న సెక్సీ పాయల్ రాజపుత్ తాజాగా వెంకటేష్ తో ‘వెంకీ మామ’ లో నటిస్తోంది. వెంకటేష్, నాగ చైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రమిది. వీళ్ళిద్దరూ నిజ జీవితంలో మేన మామ, మేనల్లుడు కావడం సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ. పాయల్ రాజపుత్, రాశీఖన్నా నాయికలు. బాబీ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. రాజు సుందరం నృత్య దర్శకత్వంలో వెంకటేష్, పాయల్ రాజపుత్ పై ఓ ప్రణయ గీతాన్ని తెరకెక్కించారు. ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణ కానుందట. ఇందులో వెంకటేష్, పాయల్ గెటప్పులు రొమాంటిక్ గా ఉంటూనే ఫన్నీగానూ ఉంటాయంటోంది చిత్ర బృందం. కుటుంబ బంధాలతో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే,, వెంకీ -పాయల్ పై చిత్రీకరిస్త్తున్న ప్రణయగీతం లో ప్రేయసిగా పాయల్ రాజపుత్ ఒయ్యారాలు ఒలక బొస్తీ రొమాన్స్ కు కొదువే లేకుండా పోయిందని యూనిట్ చెబుతోంది. ఈ పాటపై పాయల్ ని చూసిన యూనిట్ అంతగా ఇదై పోయిందట. చూద్దాం.. ఈ ‘ఆర్ఎక్స్100’ భామ మరో సారి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో !!
పాయల్ ఒయ్యారాలు అంతా ఇంతా కాదట!
Previous article
RELATED ARTICLES