“త్రీ మంకీస్” సినిమా ‘చిత్రం భళారే విచిత్రం’ అంత పెద్దహిట్ అవ్వాలి.. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి

550

జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బిగ్ స్క్రీన్ పై “త్రీ మంకీస్” చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్ గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి.దర్శకత్వంలో నగేష్ జి. నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్కును జరుపుకుంటుంది. ఈ చిత్రం లోగో, మరియు ఫస్ట్ లుక్ లాంచ్ విడుదల కార్యక్రమం సెప్టెంబర్ 22న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి మెగాబ్రదర్ నాగబాబు, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేసి త్రీ మంకీస్ లోగో, చిత్ర ఫస్ట్ లుక్ సంయుక్తంగా లాంచ్ చేసారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్, దర్శకుడు అనిల్ కుమార్, నిర్మాత నగేష్, కెమెరామెన్ సన్నీ దోమల పాల్గొన్నారు.

ఆ ముగ్గురి కామిడీ చూస్తే ఒక ఎనర్జీ వస్తుంది!!
ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను ఈ ముగ్గురూ వేరు వేరు వ్యక్తులైనా .. కానీ ముగ్గురు ఒక్కటే. ఆవకాయ, పప్పు, నెయ్యి కలిస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అలా వీళ్ళ ముగ్గురు కామిడీ ఉంటుంది. నా ఐపాడ్ లో ఎప్పుడు వీళ్లు చేసిన స్కిట్స్ వంద ఉంటాయి. టెంక్షన్ లో వున్నప్పుడు, ట్రాఫిక్ లో వున్నప్పుడు వెంటనే ఇపాడ్లో వున్న స్కిట్స్ చూస్తాను. ఒక ఎనర్జీ వస్తుంది. వెంటనే రిలాక్స్ అయిపోతాను. ట్రా

నాకు బాగా ఇష్టమైన టీమ్ అదే!!
మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ఈ సినిమా రిస్క్ అని కాకుండా జబర్దస్ట్ టీమ్ సుధీర్, శ్రీను, రాంప్రసాద్ లపై ఫోకస్ పెట్టి ఈ “త్రీ మంకీస్” మూవీని నిర్మించిన దర్శక,నిర్మాతలకు నా అభినందనలు. వాళ్లతో సినిమా తీసి వారు చాలా తెలివిగల పని చేసారు. ఎందుకంటే జబర్దస్ట్ లో సుధీర్ వాళ్ళ టీమ్ అంటే నాకు బాగా ఇష్టం. వాళ్ళ స్కిట్స్ ని బాగా ఎంజాయ్ చేస్తాను. అందరు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నారు.