1000 వాలా గ్లింప్స్ విడుదల

90

సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై తొలి చిత్రంగా, నూతన నటుడు అమిత్ హీరోగా, 10 రూపీస్ చిత్రంతో మెప్పించిన యువ దర్శకుడు అఫ్జల్ దర్శకత్వంలో, షారుఖ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం “1000 వాలా”. త్వరలో రెగ్యులర్ షూట్ జరుపుకోబోతున్న ఈ చిత్రం యొక్క “టెస్ట్ షూట్ గ్లింప్స్” సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. మంచి డైలాగ్ తో, మాస్ మ్యూజిక్ తో, రిచ్ క్వాలిటీ విజువల్స్ తో నిండిన ఈ టెస్ట్ షూట్ గ్లిమ్స్ 1000 వాలా చిత్రం మీద అంచనాలు ఏర్పడేలా చేసింది. చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో చెప్తాం అని టీం వెల్లడించారు.

ఈ చిత్రానికి కథ : అమిత్, నిర్మాత : షారుఖ్, కథనం, మాటలు : గౌస్ ఖాజా, సంగీతం : వంశీకాంత్ రేఖన, కెమెరా : చందు AJ, Vfx : నరేన్ రెడ్డి, నిర్మాణం : సూపర్ హిట్ మూవీ మేకర్స్.