ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’ . ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్సేషనల్ సంగీత దర్శకుడు రవి బసూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా
సంగీత దర్శకుడు రవి బసూర్ మాట్లాడుతూ ” శాసనసభ సమయంలో నాకు పరిచయమైన షణ్ముగం సాప్పని కోసం ఈ సినిమా చేశాను. ఎప్పుడూ ఎదో ఒకటి కొత్తగా చేయాలనే తపన అతనిలో కనిపిస్తుంది. నాకు ప్రతి విషయం చెబుతుంటాడు. ఈ సినిమా బాగా రావాలని ఎక్కడా రాజీపడకుండా దర్శకత్వం చేశాడు. ఈసినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా సినిమా కూడా అందరికి నచ్చుతుంది. తప్పకుండా ఈ సినిమాలో నా వర్క్ కూడా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. హీరో ఆది నటన అందర్ని ఆకట్టుకుంటుంది. ఆదికి ఈ సినిమా కెరీర్‌లో మంచి సినిమాగా ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ ” షణ్ముఖ ఈ టైటిల్‌లోనే ఎంతో పత్యేకత ఉంది. ఆది కెరీర్‌కు మలుపు తిప్పే సినిమాలా ఉండాలని కోరుకుంటున్నాను. గొప్ప నటుడు సాయికుమార్ వారసుడిగా ఆదికి మంచి పేరు ఉంది. ఈ సినిమాలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికి మంచి పేరు తీసుకరావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. షణ్ముఖ టైటిల్‌కు తగ్గట్టుగా దర్శకుడు షణ్ముగం ఈ చిత్రం విషయంలో మల్టీ టాలెంటెడ్‌ను చూపించాడు. తప్పకుండా ఈ చిత్రం అందరికి విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు.
అవికాగోర్ మాట్లాడుతూ ” హీరో ఆది డ్యాన్స్‌కు, ఫైటింగ్స్‌కు ఫ్యాన్స్. ఈ చిత్రంలో ఆయన నటనకు అందరూ ఫిదా అవుతారు. రవి బసూర్ నేపథ్య సంగీతం ఈచిత్రానికి హైలైట్‌కు ఉంటుంది. అందరూ కష్టపడి మంచి సినిమా చేశాం. అందరూ తప్పకుండా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ ” ఈ టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉందని చెప్పారు. అందరూ కష్టపడి చేసిన మంచి ప్రయత్నం. అందరూ ఎఫర్ట్ పెట్టాం. అవికాతో పనిచేయడం సంతోషంగా ఉంది. రెగ్యులర్ సినిమాలు కూడా అవిక చేయదు. ఆమె పాత్రకు ఎంతో ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ సినిమా ఓ మంచి ప్రయాణం. రవి బసూర్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం అందరిలో గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. అందరూ ఆ నేపథ్య సంగీతం థ్లిల్ల్‌గా ఫీలవుతారు. దర్శకుడుషణ్ముఖ ఈ సినిమాను తన భుజాలపై వేసుకుని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. అందరూ సినిమాకు విజయాన్నిఅందిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు షణ్ముగం సాప్పని మాట్లాడుతూ ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. మంచి టైటిల్‌కు తగ్గ కథతో ఈ సినిమా చేశాను. కథకు తగ్గ నేపథ్య సంగీతం అన్ని కుదిరాయి. మా అన్నయ్య మరో నిర్మాత తులసీరామ్ పుట్టినరోజున మార్చి 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అన్నారు. ఈ సమావేశంలో రచయిత సతీష్ ఆకేటి, ఎడిటర్ ఎంఏ మాలిక్, అసోసియేట్ డైరెక్టర్ రాజేష్, లైన్ ప్రొడ్యూసర్ దుర్గా ప్రసాద్ శెట్టి, నటుడు కృష్ణుడు, సిద్దు రెడ్డి, అంబటి అర్జున్, తులసీ రామ్ సాప్పని, రమేష్ యాదవ్ మనోజ్ నందం, సౌమ్య, ఐశ్వర్య, ప్రతి నాయకుడు చిరాగ్ తదితరులు పాల్గొన్నారు.