YS షర్మిల తెలంగాణ లో పార్టీ

416

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ బలంగా వున్న రోజుల్లో ఒక వెలుగు వెలిగిన నేతలందరు నేడు రాజకీయం గా సరైన గౌరవం లేకుండా వున్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థగతంగా బలంగా ఉన్నప్పటికీ.. సరైన నాయకత్వం లేక ఆ పార్టీ శ్రేణులు చెల్లచెదురు అవుతున్నాయి. కొంతమంది తెరాస లో చేరగా.. తాజాగా చాలామంది నాయకులకి బీజేపీ గాలం వేస్తోంది. బీజేపీ పట్ల పెద్దగా సుముఖత లేనప్పటికి రాజకీయ భవిష్యత్తు కోసం ఎదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితుల్లో ఆయా నాయకులున్నారు. మరోవైపు తెరాస పార్టీ లోని అసంతృప్త నేతలు బీజేపీ లోకి వెళ్లలేక… తెరాస లో ఇమేడలేక ఇబ్బందులు పడుతున్నారు… ఇలాంటి పరిస్థితి లో YS షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టబోతున్నట్లు ఆంధ్రజ్యోతి లో వచ్చిన సంచలన కథనం ఇపుడు వారిని ఊరిస్తోంది. షర్మిల నాయకత్వం లో పార్టీ వస్తే తెరాస బీజేపీ లకి ధీటుగా రాజకీయం చేయొచ్చాని సదరు నేతలు భవిస్తున్నారట. తెలంగాణ లో ప్రతి గ్రామం లో వైస్సార్ కి అభిమానులు వున్నారు. ఆరోగ్య శ్రీ, ఫింఛన్లు, ఫీజు రీ ఎంబర్స్మెంట్ ఇలా వైస్సార్ హయాంలో లబ్ది పొందిన వారంతా ఇప్పటికి ys పాలనని గుర్తు చేస్తుంటారు… షర్మిల పార్టీ పెడితే వారంతా ఆమెకి అండగా నిలిచె అవకాశం ఉంటుంది… పై గా తెలంగాణ లో షర్మిల పాదయాత్ర కూడా చేసారు… తెలంగాణ ప్రజలకి ఆమె సూపరిచితురాలే.

తెలంగాణ లో బలమైన రెడ్డి సామజిక వర్గమ్ అంతా ఆమెకి అండగా ఉండబోతుంది. బ్రదర్ అనిల్ ప్రభావం తో క్రిస్టియన్ ఓట్లు షర్మిల కొత్త పార్టీ కి అదనపు బలం. దేశం లో ముస్లింలకి విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ కల్పించిన ఏకైక నేతగా వైస్సార్ ముస్లిం లకి ఎప్పటికి గుర్తుండి పోతారు. ఆ తర్వాత న్యాయ సమస్య లు వచ్చి రిజర్వేషన్ లు ఆగిపోయినా.. కొంతకాలం వారు రిజర్వేషన్ ఫలాలు అనుభవించారంటే దానికి వైస్సార్ కారణం. ఇలా వైస్సార్ సంక్షేమ పథకాలు ద్వారా లబ్ది పొందిన వారు, రెడ్డి సామజిక వర్గం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలు షర్మిల కి మద్దతుగా నిలుస్తరనే చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఫీ రీ ఎంబర్స్మెంట్ ద్వారా లబ్ది పొందిన బీసీ వర్గాలు కూడా షర్మిల కి అండగా నిలిచే అవకాశం వుందనే విశ్లేషణ లు జరుగుతున్నాయి. ఆర్ధిక అంగ బలాలకి కూడా షర్మిల పార్టీ కి ఇబ్బందులు లేవు కాబట్టి ఆమె పార్టీ ఎపుడు ప్రకటించినా ఆమెతో నడవాలని చాలా మంది నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటికే ప్రతి జిల్లా నుంచి ముఖ్య మైన నలుగురైదుగురు నాయకులతో షర్మిల నేరుగా మాట్లాడారాట. ఏదేమైనా తెలంగాణ రాజకీయ చిత్రం పైన షర్మిల పార్టీ ప్రకటన పెను సంచలానాలు సృష్టించటం ఖయమనే విశ్లేషణ లు ప్రారంభంయ్యాయి.