HomeTeluguర్యాంబో"గా రచ్చ చేయనున్న "ఉడుంబు"

ర్యాంబో”గా రచ్చ చేయనున్న “ఉడుంబు”


# టైటిల్ పాత్రలో
యువ హీరో ఆశిష్ గాంధి!!

# గంగపట్నం శ్రీధర్ నిర్మాణం-
రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వంలో
మార్చి 28 నుంచి సెట్స్ పైకి!!

మలయాళంలో మంచి విజయం సాధించిన “ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకోవడం తెలిసిందే. టి.సి.ఎస్.రెడ్డి సమర్పణలో శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి “ర్యాంబో” అనే టైటిల్ పెట్టారు. యువ కథానాయకుడు ఆశిష్ గాంధీ టైటిల్ పాత్ర పోషించనున్నాడు. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువప్రతిభాశాలి “రత్నాకరం అనిల్ రాజు” ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తమ తమ శాఖలలో నిష్ణాతులైన స్టార్ టెక్నిషియన్స్ “ర్యాంబో” చిత్రానికి పని చేస్తున్నారు.
హోలీ పండుగను పురస్కరించుకుని “ర్యాంబో” ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మార్చి 28 నుంచి సెట్స్ కు వెళ్లనున్న ఈ క్రేజీ చిత్రానికి ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది.
యువ సంగీత సంచలనం సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి సాంగ్స్: రామజోగయ్య శాస్త్రి, డైలాగ్స్: రైటర్ మోహన్, డాన్స్: శేఖర్ మాస్టర్, ఫైట్స్: స్టంట్ జాషువా, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరావు, సమర్పణ: టి.సి.ఎస్.రెడ్డి, నిర్మాత: గంగపట్నం శ్రీధర్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రత్నాకరం అనిల్ రాజు!!

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES