అహంతో కూడిన ప్రేమకథలోని భావోద్వేగాలను, ఇగోలను చూపించడానికి రెడీ అవుతున్నారు విద్య,వాసు. మే 17న వీరి ఇగో ప్రేమకథను ప్రపంచవ్యాప్తంగా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ప్రీమియర్ కానుంది. వీళ్ల కథని టూకీగా చెప్పాలంటే రాహుల్ విజయ్, శివాని, అసలు పెళ్ళంటే ఇష్టం లేని వాసు, విద్యని పెళ్లి చేసుకోవలిసి వస్తుంది, కపుల్ అన్నాక ఒకరు తగ్గాలి ఇంకొకరు నెగ్గాలి, కాని ఇద్దరూ నేనే నెగ్గాలి అని అనుకుంటే, అదే ఇగోకి పోతే, ఆ పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపధ్యలో కథ జరుగుతుంది. మరీ విద్య వాసులు ఇగోతోనే ఉంటారా లేదా పెళ్ళైన కొత్తలో ఉండే మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తారా అనేది తెలియాలంటే ఆహాలో మే 17 వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే…
ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో, తన్విక, జశ్విక క్రియేషన్స్ పై మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మాతలుగా ఈ సినిమా రాబోతుంది. మణికాంత్ గెల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. క్యారెక్టర్స మెచ్యుర్ గా ఆలోచించినప్పటికీ వారిద్దరి మధ్యలో ఈగో అనే వాల్ ని బ్రేక్ చెయ్యనంత వరుకు వారి దాంపత్య జీవితంలోకి వెళ్ళలేరు అనే పాయింట్ ని తీసుకుని, దాన్ని వెల్ ఎక్షెక్యుట్ చేసి ప్రేక్షకుల మన్నన పొందారు. ఈ ‘విద్య వాసుల అహం’ (ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరి) ఆహాలో ఈ నెల 17న రిలీజ్ కాబోతుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
సినిమా వివరాలు:
తారాగణం:- రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి, రాజశ్రీనాయర్, వైవ రాఘవ
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే & దర్శకత్వం:- మణికాంత్ గెల్లి
బ్యానర్:- ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: తన్విక జశ్విక క్రియేషన్స్.
నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి
సహ నిర్మాతలు: రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట
తారాగణం:- రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి, రాజశ్రీనాయర్, వివరరాఘవ
సంగీతం:- కళ్యాణి మాలిక్
రచన:- వెంకటేష్ రౌతు
డీఓపీ:- అఖిల్ వల్లూరి
ఎడిటర్:- సత్య గిడుతూరి
పిఆర్ఓ:- ఏలూరు శ్రీను, మాడురీ మధు
—
Eluru Sreenu
P.R.O