HomeTeluguరంగరంగవైభవంగా వి.కె.ఆర్. ఎంటర్టైన్మెంట్స్ & 24 ఫ్రేమ్స్ మీడియా సంయుక్తంగా నిర్వహించిన షార్ట్ ఫిలిం అవార్డ్స్...

రంగరంగవైభవంగా వి.కె.ఆర్. ఎంటర్టైన్మెంట్స్ & 24 ఫ్రేమ్స్ మీడియా సంయుక్తంగా నిర్వహించిన షార్ట్ ఫిలిం అవార్డ్స్ ::

హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో రంగరంగవైభవంగా వి.కె.ఆర్. ఎంటర్టైన్మెంట్స్ & 24 ఫ్రేమ్స్ మీడియా సంయుక్తంగా నిర్వహించిన షార్ట్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అవార్డు గ్రహీతలు ఎంతో ఉత్సాహంతో.. ఆనందంతో విచ్చేశారు. సినిమా ప్రముఖులతో అవార్డు కార్యక్రమం కళకళలాడింది. ఎంతోమంది ప్రముఖులు సీనియర్ నటులు మురళీమోహన్, ప్రసన్న కుమార్, దామోదర ప్రసాద్, వల్లభనేని అనిల్ కుమార్, కెవిఎల్ నరసింహారావు, నటులు ప్రసన్నకుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
ఈ ప్రోగ్రామ్కి టైటిల్ స్పాన్సర్గా వచ్చినటువంటి శ్రీనందన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై. లి. మేనేజపింగ్ డైరెక్టర్ విజయలక్ష్మీ సిఇఒ అంజన్ కుమార్ వీరి ఆధ్వర్యంలో ఘనంగా అవార్డులు ప్రదానం, సన్మానాలు జరిగాయి. ఇలాంటి మంచి వేదికలు మరిన్ని వస్తే వారికి ప్రోత్సాహకం వుంటే మరింత కొత్త టాలెంట్ని మనం ఎంకరేజ్ చేసినట్టవుతుంది. ఆర్గనైజర్ వి.కె.రమేష్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాడు.
శ్రీనందన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై. లి. మేనేజపింగ్ డైరెక్టర్ విజయలక్ష్మీ సిఇఒ అంజన్ కుమార్లు మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలో కొత్తవారిని ఎంకరేజ్ చేసి వారికి సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే వుంటాము. కొత్తవారిలో చాలా టాలెంట్ వుంటుంది. అది బయటకు తీసుకురావడానికి మేము ఎల్లప్పుడూ వారిని ప్రోత్సహించడానికి సిద్ధం. ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరిగింది. ఇంతమంది సినీ ప్రముఖులను చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. కొత్తవారిని అందరూ ఎంకరేజ్ చేయాలి” అని అన్నారు.
నటులు మురళీమోహన్ మాట్లాడుతూ.. ‘షార్ట్ ఫిలింస్ని చాలామంది యువత కొత్తవాళ్ళు వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి తీస్తారు. వారికి ఇలా అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం. వి.కె. రమేష్ ఇలాంటి కొత్తవాళ్ళను ప్రోత్సహించడంలో చాలా ముందున్నాడు. కొత్తవారిని ప్రోత్సహిస్తేనే మరిన్ని సరికొత్త చిత్రాలు చూసే అవకాశం కలుగుతుంది. ఆర్గనైజర్స్ కి.. అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, దామోదర్, అనిల్, ప్రసన్నకుమార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
షార్ట్ ఫిలింసికి ప్రైజ్ మనీ ఫస్ట్ తోడు – రూ.1,00,000/-, సెకండ్ – అంతరం – రూ.50,000/-, థర్డ్ – టెన్త్ క్లాస్ పాస్ – రూ.25,000/- బెస్ట్ యాక్టర్ : వివక్ష, బెస్ట్ యాక్సెస్: ప్లాస్టిక్ ప్రేమ, బెస్ట్ ఎడిటర్ : మా నాన్న ఆల్కాహాలిక్, బెస్ట్ రైటర్స్ : సంభవామి యుగేయుగే, బెస్ట్ డిఒపి : ఎ ఫిల్మ్ బై. ఇంకా ఈ కార్యక్రమంలో అర్జున్ రాజు, జూ. పవన్ కళ్యాణ్, మూస అలీఖాన్, విష్ణు రెడ్డి, వైజాగ్ బ్రాండ్ అంబాసిడర్ ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ,

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES