HomeTeluguపాగల్’ - ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో హీరో విష్వ‌క్ సేన్‌

పాగల్’ – ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో హీరో విష్వ‌క్ సేన్‌


విష్వ‌క్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం `పాగ‌ల్‌`. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టించింది. సినిమా ఆగ‌స్ట్ 14న విడుద‌ల‌వుతుంది. మంగ‌ళవారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విష్వ‌క్ సేన్ తండ్రి, ఫ‌ల‌క్‌నుమాదాస్ నిర్మాత రాజు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…

హీరో విష్వ‌క్ సేన్ మాట్లాడుతూ ‘‘గత ఏడాది ‘హిట్ సినిమా తర్వాత ప్రేక్షకులను కలుసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు ‘పాగల్’ సినిమాతో మీ ముందుకొస్తున్నాను. అంద‌రూ స‌పోర్ట్ చేస్తార‌ని భావిస్తున్నాం. చాలా రిస్కీ టైమ్‌.. నా సినిమా కంటే ముందు పెద్ద సినిమా ఏదీ రాలేదు, టిక్కెట్టు రేట్స్ విష‌యంలోనూ, ఇలా చాలా స‌మ‌స్య‌లున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో రిస్క్ చేసి సినిమాను రిలీజ్ చేస్తున్నాం. నేను, బెక్కెం వేణుగోపాల్‌గారు న‌మ్మి ఈ సినిమాపై రెండు రూపాయ‌లు రిస్క్ చేద్దామంటే, మాకంటే ఈ సినిమాను ఎక్కువ‌గా న‌మ్మిన దిల్‌రాజుగారు నాలుగు రూపాయ‌ల రిస్క్ చేశారు. అంద‌రం ప్రేమించి సినిమా చేశాం. ‘పాగల్’ ప్రేమ‌క‌థ మాత్ర‌మే కాదు.. ప్రేమ గురించి చెప్పే క‌థ‌. ఇందులో స్ట్రాంగ్‌ గా మ‌ద‌ర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇందులో భూమిక‌గారు నా అమ్మ పాత్ర‌ను చేశారు. చాలా మంది నన్ను ల‌వ్‌స్టోరీ చేయ‌మ‌ని అంటుంటే.. ఏకంగా ఐదు ల‌వ్‌స్టోరీస్ ఉండే సినిమాను చేశాను. అదే పాగ‌ల్‌. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పోస్ట‌ర్స్‌లో క‌నిపించ‌ని ఓ హీరోయిన్ సినిమాలో మాత్రమే క‌నిపించ‌బోతుంది. ఆమె ఎవ‌రో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు.

ల‌క్కీ మీడియా బ్యాన‌ర్ అధినేత, చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘‘పాగల్’ సినిమాను ఆగ‌స్ట్ 14న వ‌రల్డ్ వైడ్‌గా విడుద‌ల చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు బెంగుళూరు, చెన్నై, యు.ఎస్‌ల‌లో సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఎగ్జిబిట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్నారు. దాదాపు అన్ని సెంటర్స్‌లో సినిమాను విడుద‌ల చేస్తున్నాం. దిల్‌రాజుగారు ఇచ్చిన ధైర్యంతో రిస్క్ అయినా సినిమాను థియేట‌ర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. రాజుగారికి, శిరీష్‌గారి స‌పోర్ట్ చాలా ఎక్కువ‌గా ఉంది. ఈ సినిమా జ‌ర్నీ రెండున్న‌రేళ్లు. న‌రేశ్ కుప్పిలి.. సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ స‌మ‌యంలో న‌రేశ్ ఈ పాయింట్‌ను నాకు చెప్పాడు. దాన్ని డెవ‌ల‌ప్ చేసిన త‌ర్వాత ఎవ‌రితో చేద్దామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో న‌రేశ్ నాకు తెలియ‌కుండానే విష్వ‌క్‌ను క‌లిసి క‌థ‌ను వివ‌రించాడు. అప్ప‌టికే నాకు విష్వ‌క్‌తో ప‌రిచ‌యం ఉంది. క‌థ విన్న విష్వ‌క్ సేన్‌.. ఆరోజు నుంచి ఈరోజు వ‌ర‌కు త‌ను పూర్తి స‌పోర్ట్ అందిస్తూ వ‌చ్చాడు. త‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. అలాగే నివేదా పేతురాజ్, సిమ్రాన్‌, మేఘ‌లేఖ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

విష్వ‌క్ సేన్ తండ్రి, ఫలక్ నుమాదాస్ నిర్మాత.. రాజు మాట్లాడుతూ ‘‘విష్వక్ సినిమా ఇండస్ట్రీలో రెండేళ్లుగా కాదు.. నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు. 24 క్రాఫ్ట్స్‌పై త‌న‌కు ప‌ట్టుంది. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఈ సినిమాను చేశారు. ‘పాగల్’ అనేది మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో వ‌స్తున్న సినిమా. హండ్రెడ్ ప‌ర్సెంట్ స‌క్సెస్ అవుతుంది. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.

నివేదా పేతురాజ్ మాట్లాడుతూ ‘‘ఎంటైర్ టీమ్ రెండేళ్లుగా ఈ సినిమా బాగా రావాల‌ని ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమాను ‘పాగల్’లా చేశారు. క‌చ్చితంగా ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. మంచి విజ‌యాన్ని సాధిస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్డ్ మూవీ. అన్ని వ‌య‌సుల వాళ్లు సినిమాను చూడొచ్చు. ఆగ‌స్ట్ 14న వ‌స్తున్న మా సినిమాను ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ కార్య‌క్రమంలో హీరోయిన్స్ సిమ్రాన్ చౌద‌రి, మేఘ లేఖ, జ‌బ‌ర్‌ద‌స్త్ రామ్ ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

న‌టీన‌టులు: విష్వ‌క్ సేన్‌, నివేదా పేతురాజ్‌, సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ‌, రాహుల్ రామ‌కృష్ణ, మురళీ శర్మ, మహేశ్ అచంట, ఇంద్రజ శంకర్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
నిర్మాత‌: బెక్కెం వేణుగోపాల్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌రేశ్ కుప్పిలి
సినిమాటోగ్రఫీ: మ‌ణికంద‌న్‌
మ్యూజిక్‌: ర‌ధ‌న్‌
ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌
పాట‌లు: చంద్రబోస్, రామ‌జోగ‌య్య శాస్త్రి, కెకె, అనంత శ్రీరాం
ఫైట్ మాస్ట‌ర్స్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌, రామ‌కృష్ణ‌
డాన్స్ మాస్ట‌ర్‌: విజ‌య్ బిన్ని
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌తా త‌రుణ్‌
చీఫ్ కో డైరెక్ట‌ర్‌: వెంక‌ట్ మ‌ద్దిరాల‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనిల్ భాను
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌: సిద్ధం విజ‌య్ కుమార్‌
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌
Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES