సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘థాంక్స్ అని చెప్పటంలో తెలియని ఓ ఆనందం ఉంది. మా సక్సెస్‌లో పార్టిసిపేట్ చేసిన దిల్ రాజుగారికి థాంక్స్. మీడియా కూడా ఎంతగానో థాంక్స్. మా సినిమాలో పని చేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కి థాంక్స్. ‘విరూపాక్ష’ సినిమాలో ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్‌ను ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. అజనీష్ సంగీతం, శ్యామ్ దత్ ఫొటోగ్రఫీ సహా ప్రతి ఒక క్రాఫ్ట్‌ను అప్రిషియేట్ చేస్తున్నారు. మా సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రవీణ్‌గారు, తులసీగారు, తేజగారు, దిల్‌రాజుగారికి స్పెషల్ థాంక్స్. ప్రతి విషయంలో నాకు అండగా నిలబడుతున్నసతీష్ కొప్పిరెడ్డి, సతీష్ బొట్టగారు అండగా నిలబడ్డారు. నా పర్సనల్ డ్రైవర్ నాగికి థాంక్స్.
సినిమా చేసే సమయంలో నాకు మాట సరిగ్గా రాలేదు. ఆ సమయంలో నాకు సహ నటీనటులందరూ ఎంతగానో హెల్ప్ చేశారు. మా అమ్మగారికి, డైరెక్టర్ కార్తీక్ అమ్మగారికి థాంక్స్. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు సపోర్ట్‌కి థాంక్స్. అందరూ హార్డ్ వర్క్ చేశారు. మీ అందరి ఆశీర్వాదంతో విరూపాక్ష సినిమాను మే 5న హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. అలాగే మే 12న కన్నడలో విడుదల చేస్తున్నాం. అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు.
చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను నమ్మి మేం సినిమ చేస్తే.. మాలాగే సినిమాను నమ్మి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన మా టీమ్‌కి ఆడియెన్స్‌కు థాంక్స్’’ అన్నారు.
చిత్ర సమర్పకుడు బాపినీడు.బి మాట్లాడుతూ ‘‘ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్. ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా సినిమాను ఆడియెన్స్ వరకు తీసుకెళ్లిన మీడియా మిత్రులకు థాంక్స్’’ అన్నారు.
చిత్ర దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడుతూ ‘‘మా సినిమాను రిపీటెడ్‌గా చూసి ఎంకరేజ్ చేస్తోన్న ఆడియెన్స్‌కు థాంక్స్. ఈ సక్సెస్‌కి కారణం కథ. ఈ కథ రాసుకోవటానికి కారణం ముగ్గురు స్నేహితులే. వాల్లే సంతోష్, శ్రీకాంత్, క్లాక్స్. క్లాక్స్ త్వరలోనే ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అక్కడ నుంచి మొదలైన ఈ కథ సుకుమార్‌గారికి దగ్గరకు వెళ్లింది. ఆయన స్క్రీన్ ప్లే అందించారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్‌గారికి, బాపినీడుగారికి, ప్రసాద్‌గారికి థాంక్స్. నన్ను.. కథను నమ్మి అవకాశం ఇచ్చారు. తేజుగారు కంటెంట్‌ను నమ్మి ట్రావెల్ అయ్యారు. అలాగే సంయుక్త నాపై కాన్ఫిడెన్స్‌తో యాక్ట్ చేసింది. ఆమెపై నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసింది. ఇప్పటికే మా సక్సెస్‌లో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ.. ఇంకా కొంత మంది తెర వెనుక ఈ సక్సెస్‌లో భాగమయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాకు మాటలను కృష్ణగారు అందించారు. ఉప్పెనకు ఆయన పని చేశారు. స్టోరి బోర్డ్ ఆర్టిస్ట్ ఆర్.కెగారికి థాంక్స్.
కమల్ కామరాజుగారు అయితే తన పాత్ర కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో గుండు కొట్టించుకుని వచ్చి మరీ నటించారు. ఆయన డేడికేషన్‌కి హ్యాట్సాఫ్. ఆ సీన్ ఇంపాక్ట్‌తో తొలి సీన్ నుంచి ఎంగేజ్ అయ్యారు. నా డైరెక్షన్ టీమ్ ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. మా క్రియేటివ్ డైరెక్టర్ గోగు సార్.. సినిమాకు సంబంధించిన ఒత్తిడినంతా ఆయన తీసుకుని నాకు క్రియేటివ్ ఫ్రీడమ్‌ను ఇచ్చారు. సినిమాలో నటీనటుల మేకప్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంత మంచి మేకప్ వర్క్ ఇచ్చిన పల్లవిగారికి, కాస్ట్యూమ్స్ చేసిన రజినీగారికి థాంక్స్. మేకఫ్ చీఫ్ నాగు, కాస్ట్యూమ్ చీఫ్ శ్రీనులకు థాంక్స్. దిల్ రాజుగారు సహా మా డిస్ట్రిబ్యూటర్స్‌కి థాంక్స్. మే 5న ఇతర భాషల్లోనూ మా విరూపాక్ష సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘‘సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని అనౌన్స్ చేసిన క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ వచ్చిన దర్శకుడు కార్తీక్ దండుగారికి అభినందనలు. ట్రైలర్ లాంచ్ రోజునే సినిమా సమ్మర్లో గొప్పగా సాధిస్తుందని చెప్పాను. దర్శకుడు కార్తీక్ కథ రాసుకుని ఎంత మందిని ఎంత హింస పెడితే ఈ ఔట్ పుట్ వచ్చుంటుందో నాకు తెలుసు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసి డైరెక్టర్‌కి కావాల్సిన మంచి ఔట్‌పుట్‌ను ఇచ్చారు. వారందరికీ థాంక్స్. నిర్మాతలు ప్రసాద్, బాపినీడుగారికి అభినందనలు. వెంకీ అట్లూరి తర్వాత కార్తీక్ దండుని వారు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. డైరెక్టర్ కార్తీక్ ఎంటైర్ ఆడిటోరియంను అద్బుతంగా హోల్డ్ చేశాడు. సంయుక్త మీనన్ సూపర్బ్. క్లైమాక్స్‌లో అద్భుతంగా నటించింది. తేజు.. మై బాయ్. తనతో మూడు సినిమాలు చేశాను. తన కెరీర్‌లో విరూపాక్ష హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. నాకు చాలెంజ్ విసిరారు. తనతో నేను నెక్ట్స్ సినిమాను చేస్తే ఇంకా పెద్ద సినిమాను, కొట్టే సినిమాను చేయాలి. తేజు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. తేజుకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత దేవుడు పునర్జన్మలాంటిది ఇవ్వటంతో పాటు దేవుడు ఇంత పెద్ద హిట్‌ను కూడా ఇచ్చాడు. అదంతా తన మంచితనమే. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’’ అన్నారు.
హీరోయిన్ సంయుక్తా మీనన్ మాట్లాడుతూ ‘‘విరూపాక్ష సినిమా రిలీజైన రోజు నుంచి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విరూపాక్ష మే 5 నుంచి ఇతర భాషల్లోనూ రిలీజ్ కానుంది. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయ్యి అద్బుతాలుక్రియేట్ చేస్తుందని భావిస్తున్నాం. డైరెక్టర్ కార్తీక్, నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్స్.. వెస్ట్ గోదావరి – ప్రవీణ్, గుంటూరు – వీఎంఆర్, కర్ణాటక – ఆదిత్య రెడ్డి, ఓవర్ సీస్ – తేజ, ఇంకా కృష్ణ, సాయిబాబాలతో పాటు సినిమాటోని నటీనటులు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.