యూత్ ఎంటర్టైనర్ ‘వర్జిన్ స్టోరి’ పాట లాంచ్ చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

238

 

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా “వర్జిన్ స్టోరి” కొత్త పాటని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నేడు విడుదల చేసి మూవీ టీమ్ కి ఆశిస్సులు అందించారు.

కొత్తగా రెక్కలొచ్చెనా అనే ఉపశీర్షిక తో ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించారు. ఈ సందర్భంగా…

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ, “హీరో హీరోయిన్లు సినిమా పేరు కు తగ్గట్టే ఫ్రెష్ గా ఉన్నారు. స్టోరీకి తగ్గట్టే టైటిల్ ఉంది. సాంగ్ చాలా బాగుంది. శ్రీధర్ సినిమా పై చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. డైరెక్టర్ ప్రదీప్ వాళ్ల తాత అట్లూరి పుండరీ కాక్షయ్య గారు ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి, చాలా మంచి మంచి సినిమాలు తీశారు. అందరికి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అన్నారు.

నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, “ఈ రోజు మాకు చాలా స్పెషల్ డే. నా సినిమా అరంగేట్రం నుండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న దర్శకేంద్రులు రాఘవేందర్ రావు గారు మా సాంగ్ ను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్యాన్ ఇండియా – ప్యాన్ ఇండియా అంటున్నారు అందరూ. కానీ మన ఫస్ట్ ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. కమర్షియల్ సినిమాకు కొత్త అర్థం తీసుకొచ్చిన ట్రెండ్ సెట్టర్ ఆయన. అలాంటి లెజండరీ డైరెక్టర్ ఆశీస్సులు మా ‘‘వర్జిన్ స్టోరీ’’ కి దక్కడం అదృష్ణంగా భావిస్తున్నాను. ఆయన ఆశిర్వాదాలు మాకెప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. సాంగ్ చాయిస్ లో ఆయనకంటూ మంచి టేస్ట్ ఉంటుంది, ఆయనకి ఈ పాట నచ్చిందంటే అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ నెల 18న థియేటర్ లలో విడుదల చేయాలనుకుంటున్నాం” అన్నారు.

హీరో విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ రాఘవేందర్ రావు గారు ఈ రోజు రావడం అయన చేతుల మీదుగా మా పాట లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

హీరోయిన్ సౌమిక పాండియన్ మాట్లాడుతూ రాఘవేందర్ రావు గారు పెద్ద ఫాన్ నేను అయన ఆశీర్వాదం మాకు దక్కడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందనపై అంచనాలు మాకు చాలా పెరిగాయి అన్నారు.

విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి
తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి
సంగీతం – అచు రాజమణి,
సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్,
ఎడిటర్ – గ్యారీ,
సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాఘవేంద్ర,
నిర్మాతలు – లగడపాటి శిరీష శ్రీధర్,
రచన, దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి.