HomeTeluguతేజ ఆవిష్కరించిన 'విక్రమ్' టైటిల్, ఫస్ట్ లుక్

తేజ ఆవిష్కరించిన ‘విక్రమ్’ టైటిల్, ఫస్ట్ లుక్

నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ ‘విక్రమ్’ పేరుతో ఓ ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తోంది. హరిచందన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగవర్మ నిర్మిస్తున్నారు. హీరో నాగవర్మ సరసన దివ్యా రావు కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాగా ఈ చిత్రం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు తేజ హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ “లవ్ థ్రిల్లర్ చిత్రమిది. ఓ సినిమా రచయిత ప్రేమకధ ఇది. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ రచయిత ఏమి చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం. ప్రేమకథా చిత్రాల్లో విభిన్నంగా ఉంటుంది”” అని తెలిపారు.

హీరో, నిర్మాత నాగవర్మ మాట్లాడుతూ “థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత అనువైన తేదీ చూసుకుని చిత్రాన్ని విడుదల చేస్తాం. చిత్రం చాలా బాగా వచ్చింది. పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల్లో ఎంతగానో ఒదిగిపోయారు” అని తెలిపారు. నాగవర్మ, దివ్యా రావు జంటగా నటించిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్, టార్జాన్, ఫిష్ వెంకట్, చిత్రం బాష, భూపాల్ రాజు, డాన్స్ సత్య, జయవాణి తదితరులు ఇతర

ముఖ్యతారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: సురేష్ ప్రసాద్, ఛాయాగ్రహణం: వేణు మురళీధర్, ఫైట్స్: శివప్రేమ్, ఎడిటర్ మేనగ శ్రీను, నిర్మాత: నాగవర్మ, దర్శకత్వం హరిచందన్.

RELATED ARTICLES

LATEST ARTICLES

Tuk Tuk’ Movie Review

ALL CATEGORIES