యాక్టర్ విజయ్ సేతుపతి”విక్రమార్కుడు” ప్రీ -రిలీజ్ ఈవెంట్ **

546

పాన్ ఇండియా వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ *విజయ్ సేతుపతి హీరోగా, సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు గా* వాయల శ్రీనివాసరావు సమర్పణలో ఆర్.కె.వి.కంబైన్స్ వాణి వెంకటరమణ సినిమాస్, క్రాంతి కీర్తన పతాకాలపై *గోకుల్ (కా స్మోరా చిత్రం ఫేమ్) దర్శకత్వంలో* *నిర్మాతలు కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం* *”విక్రమార్కుడు”.* దీనికి “ది రియల్ డాన్” అన్నది ట్యాగ్ లైన్.

ఈ చిత్రానికి సిద్దార్థ సంగీతాన్ని అందించారు.
కాగా ఈ చిత్రం ప్రీ- రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో కన్నుల పండుగలా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధు లుగా విచ్చేసిన దర్శకుడు,కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్, ఆయన సతీమణి రాధ రాజశేఖర్, దర్శకుడు సూర్య కిరణ్ లు చిత్ర పోస్టర్స్ ను విడుదల చేశారు. దర్శకుడు వీరశంకర్ టీజర్ ను ఆవిష్కరించగా, చిత్ర సమర్పకులు వాయల శ్రీనివాసరావు ట్రైలర్ ను విడుదల చేశారు. పాటలను నిర్మాతలు తుమ్మల పల్లి రామసత్యనారాయణ, శ్రీరంగం సతీష్ కుమార్ విడుదల చేశారు.

*ముఖ్యఅతిధులు గా విచ్చేసిన అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్ మాట్లాడుతూ,* “ఈ చిత్ర దర్శకుడు గోకుల్ తో పాటు మేం ముగ్గురం ఒకే స్కూల్ లో చదువుకున్నాం. ముగ్గురం దర్శకులవుతామని అప్పట్లో అనుకోలేదు. గోకుల్ తమిళ్ లో ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చాడు. తమిళ్ విజయ్ సేతుపతి తో తీసి సూపర్ హిట్ సాధించిన “జుంగా” సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాను సెలెక్ట్ చేసుకొని విడుదల చేస్తున్న నిర్మాతలకు ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి” అని అన్నారు.

*చిత్ర సమర్పకులు వాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ..’* “ఫ్యామిలీ ప్రేక్షకులంతా చూడదగ్గ నవరసాలు ఉన్న మంచి ఎంటర్ టైన్మెంట్ చిత్రమిది. అన్ని ఏరియాలలో అద్భుతంగా బిజినెస్ అయిన ఈ సినిమాను ఎక్కువ థియేటర్ లలో విడుదల చేస్తున్నాం” అని అన్నారు.

*నిర్మాతలు కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావులు మాట్లాడుతూ*, మొదటి నుంచి విజయ్ సేతుపతి కి మేం పెద్ద అభిమానులం. ఈ సినిమా చూసిన తరువాత మేం గోకుల్ కు ఫ్యాన్ అవ్వాలా విజయ్ సేతుపతికి ఫ్యాన్ అవ్వాలా అర్థం కాలేదు. ఎందుకంటే విజయ్ సేతుపతిని చాలా హై బడ్జెట్ లో, హై రేంజ్ లో చాలా బాగా చూపించిన ఏ 1 డైరెక్టర్ గోకుల్ అన్న అందుకే మేం ఆయన ఫ్యాన్ కూడా అయ్యాం. విక్రమార్కుడు చిత్రాన్ని ఈ నెల 5న భారీగా 500 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నాం” అని అన్నారు.

*చిత్ర ద‌ర్శ‌కుడు గోకుల్ మాట్లాడుతూ*, “ఒకే స్కూల్లో చదివిన మేము డైరెక్టర్స్ గా ఒకే వేదికపై కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.మంచి సినిమాను తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయాన్ని గతంలో నేను తీసిన “కాష్మోరా” నిరూపించింది. అందుకే తెలుగు ప్రేక్షకులంటే నాకెంతో ఇష్టం. ఇపుడు వస్తున్న ఈ “విక్రమార్కుడు” సినిమాను కూడా అదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో దేవరకొండలో విజయ్ ప్రేమ కథ హీరో విజయ్ శంకర్, రచయితలు శ్రీ సాయి, కాకర్లమూడి కృష్ణ, వర్ధమాన దర్శకురాలు లవ్లీ, హీరోయిన్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

*ఈ చిత్రం *నటీనటులు:**
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్, శరణ్య, యోగిబాబు తదితరులు.
 *సాంకేతిక బృందం:*
బ్యానర్స్ :- ఆర్.కె.వి కంబైన్స్ వాణి వెంకటరమణ సినిమాస్, క్రాంతి కీర్తన
సమర్పకులు :- వాయల శ్రీనివాసరావు
నిర్మాత‌లు: – కాకర్ల మూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావు
ద‌ర్శ‌కుడు: -గోకుల్
మ్యూజిక్‌ :-సిద్దార్థ విపిన్
సినిమాటోగ్ర‌ఫీ: – టెట్లీ
లిరిక్ రైటర్స్ ;- శశాంక్ వెన్నలకంటి
ఎడిటర్ : – దుర్గేష్
ఆర్ట్‌: -ఏ ఆర్ మోహన్  
PRO; SRI RAM MURTHY