టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్ కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవైేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్వహిస్తున్నారు. శుక్రవారం నగరంలో ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్ లో ఈ
కంపెనీ తన బిజినెస్ ప్లాన్ ను లాంఛ్ చేసింది.
వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్ , స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రానికి స్కూటర్లు, బైక్ లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా కానున్నాయి. భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని, ఈ
వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు. అందుకే వాట్స్ అండ్ వోల్ట్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
Vijay Deverakonda Invests in Electric Mobility
HERO VIJAY DEVERAKONDA invests in Hyderabad based company – WATTS & VOLTS MOBILITY PRIVATE LIMITED which is into eco commute and shared mobility by providing Electric Bikes and Scooties towards First Mile and Last Mile connectivity.
The Company operation plan and Vision statement has been launched in Telangana EV Summit held today(Oct 30, 2020) at Hyderabad. Its pay per use model wherein user can just pay for using the electric vehicle only for the distance travelled.
This electric vehicle usage is environment friendly, saves money & time and is also the future.
Watts & Volts is promoted by Vijay Madduri, Kedar Selagamsetty,Vamsi Karumanchi.
Vijay Deverakonda strongly believes in the growth of this company and hence invested into this. The Company will start active operations from Jan 2021
Telangana IT and Industries Minister KT Rama Rao has also unveiled Telangana EV Policy 2020-30 in this EV Summit
GSK MEDIA
SRINIVAS -SURESH-KUMAR
94408 41952
9618881927
9666455059
—