సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్నవిజయ్ ఆంటోనీ క్రేజీ మూవీ “బిచ్చగాడు 2”

209

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా “బిచ్చగాడు”. ఈ సినిమా సీక్వెల్ గా “బిచ్చగాడు 2” రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది.

గతంలో విడుదలైన ఈ సినిమా థీమ్ సాంగ్ వినూత్నంగా ఉండి ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉండబోతోంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా విడుదలపై చిత్రబృందం ప్రకటన చేసింది. బిచ్చగాడు 2 చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు.

దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్, నిర్మాత – ఫాతిమా విజయ్ ఆంటోనీ, బ్యానర్ – విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, రచన, సంగీతం,
ఎడిటింగ్, దర్శకత్వం – విజయ్ ఆంటోనీ.