త్వరలో థియేటర్స్ లో విడుదల అవుతున్న విద్యార్థి

489

మ‌హాస్ క్రియేష‌న్స్ పతాకం పై మ‌ధు బాబు దర్శకత్వం లో ‘రాజుగారి గ‌ది’ ఫేమ్ చేత‌న్ చీను, టిక్‌టాక్ ఫేమ్ బ‌న్నీ వాక్స్ (వ‌ర్షిణి) హీరో హీరోయిన్లుగా ఆళ్ల వెంక‌ట్ (ఏవీ) మరియు రామకృష్ణ రేజేటి కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘విద్యార్థి’. ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీ గా ఉంది. త్వరలోనే థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

నిర్మాతలు ఆళ్ల వెంకట్ మరియు రామకృష్ణ రేజేటి మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మా విదార్థి సినిమా టీజర్ ను చాలా బాగా ఆదరించారు. మా సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ బాగా తెరకెక్కించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతొంది, మా సినిమాకు పని చేసిన అందరూ టెక్నీషయన్స్, ఆర్టిస్ట్స్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కెమెరా మాన్ పనితనం సినిమా కి ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది.

మధు బాబు దర్శకత్వం, బల్గానిన్ సంగీతం, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ సినిమా కి మంచి హైప్ తీసుకొస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మా సినిమా ని థియేటర్ లో విడుదల చేస్తాము” అని తెలిపారు.

తారాగ‌ణం:
చేత‌న్ చీను, బ‌న్నీ వాక్స్ (వ‌ర్షిణి), ర‌ఘుబాబు, మ‌ణిచంద‌న‌, జీవా, టీఎన్ఆర్‌, న‌వీన్ నేని, యాదమ్మ రాజు, నాగ‌మ‌హేష్‌, ప‌వ‌న్ సురేష్‌, జ్వాల కోటి, శ‌ర‌ణ్ అడ్డాల‌.

సాంకేతిక బృందం:
పాట‌లు: భాస్క‌ర‌భ‌ట్ల‌, సురేష్ బ‌నిశెట్టి, వాసు వ‌ల‌బోజు
సినిమాటోగ్ర‌ఫీ: కన్నా పిసి.
ఎడిటింగ్‌: బొంతల నాగేశ్వ‌ర‌రెడ్డి
స్టంట్స్‌: రామ‌కృష్ణ‌
కొరియోగ్ర‌ఫీ: అనీష్‌
మాటలు : నవీన్ కోలా, మధు బాబు
లైన్ ప్రొడ్యూస‌ర్‌: వ‌ంశీ తాడికొండ‌
స‌హ నిర్మాత‌: రామ‌కృష్ణ రేజేటి (ఆర్‌.ఆర్‌.కె.)
నిర్మాత‌: ఆళ్ల వెంక‌ట్ (ఏవీ) మరియు రామకృష్ణ రేజేటి

బ్యాన‌ర్‌: మ‌హాస్ క్రియేష‌న్స్  –ద‌ర్శ‌క‌త్వం: మ‌ధు బాబు

Pavan Kumar  PRO

9849128215