తెలంగాణ లో 20 సంవత్సరాల క్రితం ముగ్గురు మహిళల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లవ్ & క్రైమ్ కథే ఈ సినిమా.వి.యఫ్.సి క్రియేషన్స్ పతాకంపై హరి మేఘామ్స్ , రవితేజ, హనీ నటీ, నటులుగా కొప్పుల చిన్నయ్యని దర్శకుడిగా పరిచయం చేస్తూ తునికి హరికృష్ణ నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ దైవ సన్నిదానంలో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వేణుగోపాల్ చారి, నటుడు రఘు బాబు, దర్శక, నిర్మాత నాగబాల సురేష్ కుమార్, నిర్మాత శ్రీ రంగం శ్రీనివాసు, వైబవ్ తదితరులు చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్ కొట్టగా, నిర్మాత శ్రీ రంగం శ్రీనివాసులు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. టి.యన్.జి.ఓ ప్రెసిడెంట్ ప్రభాకర్ గౌరవ దర్శకత్వం వహించారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
చిత్ర దర్శకుడు కొప్పుల చిన్నయ్య మాట్లాడుతూ…. 20 సంవత్సరాల క్రితం తెలంగాణలో జరిగిన లవ్ అండ్ క్రైమ్ స్టోరీని ఇతివృత్తంగా చేసుకుని ఈ సినిమా తీయడం జరిగుతుంది.అభ్యుదయంగా ఎదగాలనుకున్న స్త్రీకి పురుషుడు ప్రతిసారి ఎదో రకంగా అడ్డు పడుతూనే ఉంటాడు. అలాంటి సమయంలో వారు ఎలాంటి అవస్థలకు గురవుతున్నారనే చక్కని కథను రాసుకోవడం జరిగింది.ఈ సినిమాలో బాల్యము, కౌమారం, యవ్వనం దశలలో ముగ్గురు మహిళలు వారి జీవితాలలో ఎదుర్కొన్న యదార్థ కథలను ఈ సినిమాలో తెలియ జేయడం జరుగుతుంది.ఈ సినిమా మొత్తం తెలంగాణ లోని నిర్మల్, ఖానాపూర్, జిన్నారం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో నటీనటులను కొంత మందిని ఎంపిక చేశారు ఇంకా కొంత మందిని ఎంపిక చేసి పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు
చిత్ర నిర్మాత తునికి హరికృష్ణ మాట్లాడుతూ..మా వి. యఫ్. సి క్రియేషన్స్ పతాకంపై మేము నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలకు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. తెలంగాణ లో జరిగిన యదార్థ కథను దర్శకుడు చెప్పిన విధానం మరియు కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. తెలంగాణ సంస్కృతి తికి అద్దం పట్టేలా ఉండే ఈ సినిమా ఎక్కువగా తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది.రెండు షెడ్యూల్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా మొత్తం తెలంగాణలోనే షూటింగ్ జరుపుకుంటుంది.మంచి కథతో ఈ బ్యానర్ లో తీస్తున్న ఈ సినిమా మా అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
పాటల రచయిత దాసండ్ల అంజయ్య మాట్లాడుతూ.. కథ చాలా బాగుంది. ఈ సినిమాకు నేను ఐదు పాటలు రాశాను. పాటలు చాలా బాగా వచ్చాయి. మంచి కథాంశంతో పాటు మంచి మెలోడీ ఇందులో ఉంటుంది.అన్ని వర్గాల వారికి నచ్చే విధమైన మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుంది. అన్నారు.
నటుడు డి.యల్. యన్.చారి మాట్లాడుతూ..ఇందులో నేను మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటీ, నటులు
హరి మేఘామ్స్ , రవితేజ, హనీ, డి.యల్. యన్.చారి
తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : వి.యఫ్.సి క్రియేషన్స్
నిర్మాత : తునికి హరికృష్ణ
డైరెక్షన్ : కొప్పుల చిన్నయ్య
మ్యూజిక్ : జయంత్
సినిమాటోగ్రాఫర్ : కంకళ్ళ అశోక్ రెడ్డి
పాటల రచయిత : దాసండ్ల అంజయ్య
పి. ఆర్. ఓ : శ్రీధర్