నాన్న‌గారు ఉండుంటే `వెంకీమామ‌` చూసి ఎంజాయ్ చేసుండేవారు – విక్ట‌రీ వెంక‌టేశ్‌ నా కెరీర్‌లో `మ‌నం`, `వెంకీమామ‌` చిత్రాలు చాలా స్పెష‌ల్ – అక్కినేని నాగ‌చైత‌న్య‌

700

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మ‌ల్టీస్టారర్ `వెంకీమామ‌`. విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో …

ఫైట్ మాస్టర్ విజ‌య్ మాట్లాడుతూ – “వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య అభిమానుల‌కు ఇది పెద్ద పండగ‌లాంటి సినిమా. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ బాబీగారికి, నిర్మాత‌లు టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, డి.సురేష్‌బాబు స‌హా ఫ్యాన్స్‌కు కూడా ఇది పెద్ద పండ‌గ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

స‌హ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – “ఈ సినిమాను రెండు బ్యాన‌ర్‌లు నిర్మించాయి. ఇద్ద‌రు ప్రొడ్యూస‌ర్ కానీ నిజానికి న‌లుగురు ప్రొడ్యూస‌ర్స్ మా సినిమాకు ప‌నిచేశార‌ని చెప్పాలి. ఎందుకంటే హీరోలు వెంక‌టేశ్‌, చైత‌న్య‌లిద్ద‌రూ నిర్మాత‌లుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అందుకే ఈ సినిమా చ‌క్క‌గా వ‌చ్చింది. వారికి ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్‌. ఎమోష‌నల్ సీన్స్ చేయ‌డంలో వెంక‌టేశ్‌గారు మాస్ట‌ర్ ఆయ‌న‌తో పాటు చైత‌న్య‌గారు కూడా ఎమోష‌న‌ల్ సీన్స్‌లో చ‌క్క‌గా న‌టించారు. డిసెంబ‌ర్ 13న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను అంద‌రూ చ‌క్క‌గా ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.

నిర్మాత టీజీ విశ్వ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “నాకు వెంకీమామ సినిమా చేసే అవ‌కాశం ఇచ్చిన సురేశ్‌బాబుగారు, వెంక‌టేశ్‌గారు, చైత‌న్య‌గారు, బాబీగారికి థ్యాంక్స్‌. ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎమోష‌న్స్‌తో ఉన్న సినిమా ఉన్న సినిమా. డిసెంబ‌ర్ 13న సినిమా విడుద‌ల‌వుతుంది“ అన్నారు.

నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ – “మానవ సంబంధాల‌పై తెర‌కెక్కించిన చిత్రం `వెంకీమామ‌`. ఏడాదిన్న‌ర క్రితం జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి అనే రైట‌ర్ వ‌చ్చి ఈ క‌థ‌ను నాకు వినిపించారు. విన్నాను.. బావుంది. చూద్దాం అన్నాను. త‌ర్వాత ఆ క‌థ బాబీ చేతికి వ‌చ్చింది. ఆయ‌న దాన్ని అద్భుతంగా డెవ‌ల‌ప్ చేశారు. ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, రిలేష‌న్ షిప్స్‌, త్యాగాలు ఇలా అన్ని అంశాలుంటాయి. రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌, కాశ్మీర్‌లో ఈ సినిమాను చిత్రీక‌రించాం. కాశ్మీర్‌లోని రిస్కీ లొకేష‌న్స్‌లో ఈ సినిమాను 25 రోజుల పాటు చిత్రీక‌రించాం. అన్నారు.

రాశీఖ‌న్నా మాట్లాడుతూ – “నేను కూడా మీలాగే సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. హీరోయిన్‌గానే కాదు, వెంక‌టేశ్ అభిమానిలా ఎదురుచూస్తున్నాను. చైత‌న్య‌తో పాటు వెంక‌టేశ్‌గారితో క‌లిసి న‌టిచండం హ్యాపీగా అనిపించింది. ఆయ‌న కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయ‌న గొప్ప న‌టుడే కాదు.. గొప్ప వ్య‌క్తి. చైతుతో మ‌నం త‌ర్వాత క‌లిసి ప‌నిచేస్తున్నాం. “ అన్నారు.

డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) మాట్లాడుతూ – “నేను విధిని న‌మ్మేవాడిని కానీ.. ఈ సినిమాకు 100 శాతం న‌మ్మాను. ఎందుకంటే జైల‌వ‌కుశ సినిమాను క‌ల్యాణ్‌రామ్‌గారు ఎన్టీఆర్‌గారి పేరు మీద పెట్టిన బ్యాన‌ర్‌లో తార‌క్‌తో ప‌ని చేశాను. త‌ర్వాత మామ‌, అల్లుడు మ‌ధ్య రిలేష‌న్‌తో సినిమా చేద్దామ‌ని కోన‌గారు చెప్ప‌గానే.. నిజ జీవితంలో ఓ కుటుంబానికి చెందిన మామ అల్లుడు క‌లిసి చేసే సినిమా త‌ప్ప‌కుండా బావుంటుంద‌న‌నిపించి విన్నాను. త‌ర్వాత సురేష్‌గారిని క‌లిసి నెరేష‌న్ ఇచ్చాను.

యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ – “డిసెంబ‌ర్ 13న `వెంకీమామ‌`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. వారం ప‌దిరోజులుగా యూనిట్ అంద‌రిలో థ్రిల్ల‌ర్ సినిమాలా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ డిస్క‌ష‌న్ న‌డిచింది. ఇప్పుడు మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్‌. నా కెరీర్‌లో మ‌నం, వెంకీమామ చిత్రాలు జ్ఞాప‌కాలు. రేపు ఎన్ని సినిమాలు వ‌చ్చినా, వీటిని రీప్లేస్ చేయ‌లేం. ప్ర‌తి విష‌యంలో ఈ సినిమ పరంగా బెస్ట్‌గానే జ‌రిగింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో ప‌నిచేయ‌డం నా కోరిక‌. ‘అన్నారు

న‌టీన‌టులు:
వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్, ప్ర‌కాశ్‌రాజ్‌, రావు ర‌మేశ్‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)
నిర్మాత‌లు: సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
బ్యానర్స్: సురేష్ ప్రొడక్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ
కో ప్రొడ్యూస‌ర్‌: వివేక్ కూచిబొట్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
కెమెరా: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి
పి.ఆర్‌.ఓ: వ‌ంశీ శేఖ‌ర్‌