HomeTeluguతిరుమల వెంకన్న సన్నధిలో రిలీజ్ డేట్ ప్రకటించిన హీరో వెంకన్న

తిరుమల వెంకన్న సన్నధిలో రిలీజ్ డేట్ ప్రకటించిన హీరో వెంకన్న

క్లాసిక్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సుదిక్షా,సునీత,, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర హీరో వెంకన్న తిరుమల వెంకటేశ్వర స్వామినీ దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులతో అక్టోబర్ 27 న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా
చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ… మా “ఒక్కడే 1” సినిమా తొలి కాపీ సిద్ధమైంది. సినిమా పరిశ్రమ ఎందరో కొత్త వారిని అక్కున చేర్చుకుంది. ఆ కోవలోనే నేను హీరోగా నటించిన మా చిత్రం ప్రేక్షకులకు కావలసిన సర్వ హంగులతో రూపుదిద్దుకుంది.
నాకు పోలీస్‌ ఆఫీసర్‌ కావాలని చాలా బలమైన కోరిక ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాలవలన కాలేక పోయాను. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీర్చుకుంటున్నా. సినిమాలో ఇంకా చాలా మంచి కంటెంట్‌, ట్విస్ట్‌లు ఉంటాయి. మన టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేశాను. దర్శకుడు శ్రీపాద రామచంద్రరావు గారు బాగా డీల్‌ చేశారు . ఈ సినిమాను అక్టోబర్ 27 తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. యూనిట్‌ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.”అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌: నందమూరి హరి`యన్‌.టి.ఆర్‌, సంగీతం: రామ్‌ తవ్వా, కొరియోగ్రఫీ: సాగర్‌ వేలూరు, లిరిక్స్‌: శ్రీనివాస్‌, ఫైట్స్‌: రాజ్‌కుమార్‌, కృష్ణంరాజు, శ్యాం, కెమెరా: డి. యాదగిరి, ఆర్‌.ఆర్‌. చిన్నా (చెన్నై), వి.ఎఫ్‌.ఎక్స్‌: చందు ఆది Ê టీమ్‌, పి.ఆర్‌.ఓ: బి. వీరబాబు, నిర్మాతలు తల్లాడ శ్రీలక్ష్మి, తల్లాడ సునీల్‌, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపాద రామచంద్రరావు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES