HomeTeluguమార్చి లో వస్తున్న "వీరఖడ్గం"

మార్చి లో వస్తున్న “వీరఖడ్గం”

వివివి ప్రొడక్షన్స్ పతాకంపై ఎం ఏ చౌదరి దర్శకత్వంలో, కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం “వీరఖడ్గం”. చరిత్ర శిథలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి…పగ కూడా అంతే. ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైన సరే దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మృగమై వెంటాడుతుంది, వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ…. వీరఖడ్గం…

ఎంతో మంది ప్రావీణ్యం కలిగిన టెక్నీషియన్స్, ఆధునిక సాంకేతికతో ఈ చిత్రాన్ని రూపొందించారు, తమిళ్ పొన్ను సృష్టి దాంగే, తన అందాలతో అలరించింది,

సీనియర్ విలక్షణ నటులు సత్యప్రకాష్ , ఆనంద్ రాజ్, తమదైన నటనా శైలి తో మెప్పించారు, నవ్వులు కూడా ఈర్ష్య పడేలా హాస్యామృతాన్ని పంచే హాస్యాబ్రహ్మ బ్రహ్మానందం, మదన్, తపస్వి, అపూర్వ పృద్విరాజ్, టార్జన్,ధనరాజ్, తాగుబోతు రమేష్, చలపతి రావు ,తదితరులు నటించారు వివివి ప్రొడక్షన్స్ లైన్ ప్రొడ్యూసర్ మారిశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ…సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అని ప్రీమియర్ చూసిన సినీ ప్రముఖులు, పాత్రికేయులు ప్రశంశించారు, ఎమ్.ఏ చౌదరి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈ చిత్రాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి. సంపంగి, ప్రేమలో పావని కళ్యాణి, శ్రీమన్నారాయణ లాంటి అద్భుతమైన చిత్రాలకి మాటలు అందించిన రైటర్ “ఘటిఖాచలం “ఈ చిత్రానికి మాటల సంపద ఇచ్చారు. సంగీత దర్శకులు :షయాక్ పార్వాజ్ స్వరాలని సమకూర్చారు.. పోరాట సన్నివేశాలని నందు, దేవరాజ్ మాస్టర్, అద్భుతంగా చిత్రీకరించారు. శివరాత్రికి పబ్లిసిటీ మొదలు పెట్టి మార్చి మొదటి వారం లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన తెలిపారు. ప్రొడ్యూసర్ :K. కోటేశ్వరరావు, దర్శకత్వం. ఎం ఏ చౌదరి

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES