ప్రముఖ దర్శకడు శేఖర్‌కమ్ముల చేతులమీదుగా ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ ఫస్ట్‌లుక్‌ విడుదల

475

కౌసల్య కృష్ణమూర్తి, పడేసావే, ఆపరేషన్‌గోల్డ్‌ ఫిష్‌ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. అందాలభామ మిస్తి చక్రవర్తి నాయిక. తేజ స్వి క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై సందీప్‌ గోపిశె ట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల ‘లవ్‌స్టోరి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కార్తీక్‌రాజునటించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఇంప్రెసివ్‌గా వుంది. చిత్రం కూడా ప్రేక్షకులు అలరించేలా వుంటుందని అనుకుంటున్నాను. ఈ చిత్రం విజయం సాధించి అందరికి మంచిపేరును తీసుకరావాలని ఆశిస్తున్నాను’ అన్నారు.

దర్శక నిర్మాత సందీప్‌ గోపిశె ట్టి మాట్లాడుతూ ‘ ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల గారితో మా ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్‌ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ఇది. ఆడియన్స్‌ సర్‌ఫ్రైజ్‌గా ఫీలయ్యే ఎ న్నోఅంశాలు ఈ చిత్రంలో వున్నాయి. పూ ర్తి కొత్తదనంతో, నిజాయితీగా తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. ప్రశాంత్‌, భీమనేని శ్రీనివాస్‌, దేవి ప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, ఆమని, గణపతి, అన్వి, డా.శేషసాయి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: మహి శార్ల, సంగీతం!: జీవీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఆర్‌వీ రామకృష్ణ, కథ న్‌ప్లే-దర్శకత్వం-నిర్మాత : సందీప్‌ గోపిశెట్టి