అద్భుతమైన మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందేశాత్మక చిత్రం “వధు కట్నం”  ట్రైలర్ లాంచ్

312

గ్రీన్ క్రాస్ థియోసోఫికల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ సమర్పణలో షబాబు ఫిలిమ్స్ పతాకంపై శ్రీ హర్ష, ప్రియా శ్రీనివాస్, రఘు జి. కవిత శ్రీరంగం,ఆర్యన్ గౌర, రేఖ ఇందుకూరి, జాన్ కుషాల్, ఆనోణ్య, పాణిగ్రహి,  మణిచందన, నాగలక్ష్మి, ఇంజి, రాకెట్ రాఘవ, రాము (జబర్దస్త్) తదితరులు ప్రధాన పాత్రలుగా  భార్గవ గొట్టుముక్కల దర్శకత్వంలో షేక్ బాబు సాహెబ్ (బాబుషా) నిర్మించిన సందేశాత్మక హాస్యరస కుటుంబ కథా చిత్రం “వధు కట్నం” .ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రధానకార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

టి.యఫ్.పి.సి ప్రధానకార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ .. ఈ చిత్ర నిర్మాత,దర్శకులు కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా సమాజంలో భాధ్యత గల పౌరులు గా వ్యవహరించాలని, మహిళలపై చూపుతున్న వివక్షతను రూపు మాపాలని, స్త్రీలను రక్షించి, గౌరవించాలని సృష్టికి మూలం స్త్రీయే అని వాళ్లకు జరుగుతున్న  అన్యాయాలను ఎదుర్కోవాలని నిర్మించిన ఈ చిత్రం పూర్తి  హాస్య రస కుటుంబ కదా చిత్రం గా అన్ని రకాల అంశాలు ప్రభావితం చేసే విధంగా అమ్మ సెంటిమెంట్, స్త్రీ ల సమస్యలపై పోరాడే ఉద్యమము సాంగ్, యువతను  చెడు దారి వైపు తిప్పే పబ్ ల ప్రభావం కళ్ళకు కట్టినట్టు తెలియజేసే పబ్ సాంగ్ , ఇలా అన్ని రకాల అంశాలతో, రూపొందించటం వంటి అంశాలు యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉందని అభినందించారు. బోయపాటి  లెజెండ్ చిత్రం లోనూ, ఉషాకిరణ్ ప్రతిఘటన చిత్రం లోనూ ఈ విధంగానే  మహిళా సమస్యల ఆధారంగా  రూపొందించారని, అవి గొప్ప విజయం సాధించాయి. ఇప్పుడు వస్తున్న ఈ చిత్రం కూడా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. ,

చిత్ర దర్శకుడు భార్గవ గొట్టిముక్కల మాట్లాడుతూ … ప్రస్తుత సమాజంలో మహిళలు ఎన్నో రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నా..ఇంకా మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని, స్కానింగ్ లో ఆడ శిశువు అని తెలుసుకొని కొందరు అబార్షన్ చేయించడం వల్ల ఆడపిల్లల శాతం తగ్గి పెళ్లికి మగపిల్లలకు, ఆడపిల్లలే దొరక్కపోతే వాళ్లకే “వదు కట్నం” ఇవ్వాల్సి వస్తుందని రోజులు వస్తాయన్న సందేశంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించాము. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకు లందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత షేక్ బాబు సాహెబ్ (బాబుషా) మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పట్ల జరిగే అన్యాయాలను ప్రశ్నించే మహిళా నాయకురాలి పాత్రలో ప్రముఖ నటి మనిచందన నటించారు.ఇందులో ఉన్న  పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సెన్సార్ వాళ్ళు కమర్షియల్ చిత్రాలు తీస్తున్న ఈ రోజుల్లో ఒక అద్భుతమైన సందేశాత్మక  చిత్రాన్ని నిర్మించిన చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. ఈ చిత్రాన్ని  డిసెంబర్ నెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు.

ఈ చిత్ర కెమెరామెన్ ప్రముఖ దర్శకులు ఎస్ డి.లాల్ కుమారుడు ఎస్. డి.జాన్, సంగీత  దర్శకులు ప్రభు నవీన్ లంక లు తమ అనుభవాలు తెలుపుతూ.. ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రం  నిర్మాణం లో భాగమై నందుకు సంతృప్తి గా ఉంది. ఈ చిత్రానికి అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కుమారి షర్మిల భార్గవి ఆకర్షణీయమైన ముద్దు ముద్దు మాటలతో వ్యాఖ్యా నించారు,అలాగే స్త్రీల సమస్యలపై, వాటి ఉద్యమాలపై, పరిష్కార దిశగా చర్చపై ఇంత మంచి చిత్రం నిర్మించి మా గౌరవం నిలిపారని ప్రముఖ నటి,నర్తకి, మానవ హక్కుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి నాగలక్ష్మి ఇంజి ఆద్వర్యంలో మహిళలు చిత్ర నిర్మాత, దర్శకులను సత్కరించి అభినందించారు.ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ప్రసంగించారు.

నటీనటులు
శ్రీ హర్ష, ప్రియా శ్రీనివాస్, రఘు జి. కవిత శ్రీరంగం,ఆర్యన్ గౌర,రేఖా ఇందుకూరి,జాన్ కుషాల్, ఆనోణ్య, పాణిగ్రహి, మణి చందన, నాగలక్ష్మి, ఇంజి, రాకెట్ రాఘవ,రాము (జబర్దస్త్),చైతన్య, శ్రీనివాస్, కోటేశ్,మానస, జ్యోతి, శశి కుమార్,రవి శంకర్,రాఘవ గుబ్బల, ధర్నాకర్, శ్రీనివాస్, డి.శ్రీకాంత్ తదితరులు

సాంకేతిక నిపుణులు
కాస్ట్యూమ్స్ : నాగేశ్వరరావు
మేకప్ : బాలరాజు
ఆర్ట్ డైరెక్టర్ : విజయ కృష్ణ
డాన్స్ మాస్టర్ : కృష్ణ
పాటలు : శ్రీరాం తపస్వీ
గాయకులు : కౌసల్య, మాళవిక, నిత్య సంతోషిణి
ఎడిటర్ : సునీల్ మహారణా
సినిమాటోగ్రాఫర్ :యస్ డి.జాన్
మ్యూజిక్ డైరెక్ట్ : ప్రభు ప్రవీణ్ లంక(నాని),
కో డైరెక్టర్ : రామారావు శీతారాల, గోలి వెంకటేశ్వర్లు
అసోసియేట్ డైరెక్టర్ : కృష్ణ, నరేష్ కురాకుల
అసిస్టెంట్ డైరెక్టర్ : చిన్న తిమ్మ రాజు, ప్రసాద్,బాబి, రాజు
కో ప్రొడ్యూసర్స్ : గౌసియా షబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : షేక్ మహ్మద్ బాబు (బబ్లూ)
నిర్మాత : షేక్ బాబు సాహెబ్ (బాబుషా)

మాటలు, స్క్రీన్ ప్లే డైరెక్షన్ : భార్గవ గొట్టిముక్కల  

PRO;PADMALYA SHARMA