ఉత్తర ప్రీ రిలీజ్ ఈవెంట్,జనవరి 3న గ్రాండ్ రిలీజ్

512

నిమ్మల శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’. జనవరి3 న విడుదలకు సిద్దం అయిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.కొన్ని కథలు కొన్నిజ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి. వాటిలోని స్వచ్ఛదనం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది అలాంటి కథే ఉత్తర. తెలంగాణా సొగసును తెరమీద ఆవిష్కరించిన ఈ మూవీ
ప్రేక్షకుల్ని అలరించేందుకు జనవరి 3 రాబోతుంది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు రాజకీయ ప్రముఖలు పాల్గోన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీపతి రంగదాస్ మాట్లాడుతూ:ః ‘ సినిమా చేయాలనే కోరిక ఇప్పటిదికాదు. నాలుగేళ్ల క్రితమే ప్రయత్నాలు
మొదలు పెట్టాం. నా తండ్రి కోరిక మేరకు కుటుంబ బాధ్యతలు తీసుకొని బిజినెస్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా నా మనసులోంచి సినిమా పోలేదు అందుకే తిరుపతి కలసి కథ చెప్పగానే నచ్చి వెంటనే ఓకే చేసాను. నా అంచనాలను
మించి సినిమా చేసి చూపించాడు.   అన్నారు.

సమర్పకులు రవికుమార్ మాదారపు మాట్లాడుతూ: ‘ఉత్తర లో ఒక మ్యాజిక్ ఉంది. తెలంగాణా పల్లె దనం తెరమీద స్వచ్ఛంగా
కనిపిస్తుంది. దర్శకుడు తిరుపతి ఈ సినిమా కోసం చాలా స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నాడు.మా ప్రయత్నం అందరి ఆశిస్సులు అందుకుంటుందని నమ్ముతున్నాను ’ అన్నారు.

హీరోయిన్ కారుణ్య కత్రేన్ మాట్లాడుతూ: ‘ఈ సినిమాలో స్వాతి అనే పాత్రలో కనిపిస్తాను. మా దర్శకుడు తిరుపతి యస్ ఆర్ గారు నేచురల్ గా కథను తెరమీదకు తెచ్చారు. శ్రీరామ్ తో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.  అన్నారు.

హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ: ‘నేను సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు నాకంటే మా నాన్న నాపై ఎక్కు వ నమ్మకం ఉంచే వాడు. ఆయన నమ్మకం చూసి నాకు భయమేసేది. ఇక్కడ నేను ఉన్నానంటే దానికి కారణం మానాన్న. ఒక్క పదినిముషాలు మాట్లాడి నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు తిరుపతి గారి నేను ఎప్పటికీ రుణ పడి ఉంటాను. ’ అన్నారు.

దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లాడుతూ: ‘సినిమా చేయడం కంటే వాటిని ప్రేక్షకుల కు చేర్చడం ఎక్కవు కష్టంతో కూడుకున్న పని , ఉత్తర సినిమాకి ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగాచాలా అనుభవాలు ఎదుర్కొన్నాను. ఒంటరిగా ఏడ్చిన సందర్భలున్నాయి. వంద అడుగులు ముందుకు వేస్తే, వెయ్యి అడుగులు వెనక్కి లాగిన ఫీలింగ కలిగేది . నాకు సపోర్ట్ గా
నిలిచిన శ్రీపతి రంగదాస్, రవికుమార్ లకు చాలా థ్యాంక్స్.  అన్నారు.

రవి కుమార్ మాదారపు సమర్సణలో లైవ్ ఇన్ సి క్రియేషన్స్ , గంగోత్రి ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించిన ఉత్తర జనవరి 3 విడుదలకు సిద్దం అయ్యింది.

సమర్పణ: రవికుమార్ మాదారపు.
బ్యానర్స్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్స్.
సినిమాటోగ్రఫీ: చరణ్ బాబు
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
ఎడిటర్: బొంతుల నాగేశ్వర రెడ్డి
రైటర్: ఎన్. శివ కల్యాణ్
ప్రొడ్యూసర్స్ : తిరుపతి యస్ ఆర్. శ్రీపతి గంగదాస్.
రచన మరియు దర్శకత్వం : తిరుపతి యస్ ఆర్