“ప్లాన్-బి” టీజర్ ని రిలీజ్ చేసిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్!!

513

శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా డింపుల్ హీరోయిన్ గా ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై నవ దర్శకుడు కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న చిత్రం “ప్లాన్-బి”. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.. మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కునాల్ శర్మ ప్రతినాయకుడుగా నటించడం విశేషం.. కాగా ఈ చిత్రం టీజర్ ని మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రిలీజ్ చేసారు. టీజర్ చాలా క్యూరియాసిటీగా ఉందని, సినిమా గ్రాండ్ సక్సెస్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని.. ఆయన టీమ్ ని అభినందించారు.

చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ.. ‘ ఫస్ట్ సిట్టింగ్ లోనే కథని ఓకే చేసి నా మీద నమ్మకంతో సినిమా చేసే అవకాశం ఇచ్చిన మా నిర్మాత ఎవిఆర్ గారికి నా థాంక్స్. కమేడియన్ శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ సూపర్బ్ గా నటించారు. విభిన్నమైన పాత్రల్లో మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ నటించారు.. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కునాల్ శర్మ విలన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. మేము అడగ్గానే మా సినిమా టీజర్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్ గారికి మా కృతజ్ఞతలు. సినిమా ఔట్ ఫుట్ బాగా వచ్చింది. నాకు సహకరించి సపోర్ట్ చేసిన మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నా థాంక్స్.. అన్నారు.

చిత్ర నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ.. ‘ మా రిక్వెస్ట్ ని మన్నించి అడిగిన వెంటనే మా చిత్రం టీజర్ విడుదల చేసిన గొప్ప దర్శకులు త్రివిక్రమ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటికే విడుదలైన ప్లాన్-బి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి స్పందన వచ్చింది.. టీజర్ కూడా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా చిత్రాన్ని రూపొందించాడు రాజమహి. నటీనటులు వద్దనుండి తనకి కావాల్సిన పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. షూటింగ్ పూర్తయింది.. మేము ఊహించిన దానికంటే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలో ప్లాన్-బి చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.. అన్నారు.

మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, కునాల్ శర్మ, షాని, సబీనా, నవీనారెడ్డి, మీనా వాసు, చిత్రం శ్రీను, దయానంద రెడ్డి, డెబోరా, బన్ను, వర్ధన్ పెరుర్, రాజేంద్ర, నటిస్తోన్న ఈ చిత్రానికి డివోపి; వెంకట్ గంగాధరి, మ్యూజిక్; స్వర, బ్యాక్ గ్రౌండ్ స్కోర్; శక్తికాంత్ కార్తీక్, ఎడిటర్; ఆవుల వెంకటేష్, యాక్షన్; శంకర్ ఉయ్యాల, ఆర్ట్; కృష్ణ చిత్తనుర్, ప్రొడక్షన్ డిజైనర్; సతీష్ దాసరి, డిటియస్; రాధాకృష్ణ, డిఐ కలరిస్ట్; ప్రసాద్ ల్యాబ్స్ ప్రేమ్, సౌండ్ ఎఫెక్ట్స్; రఘునాథ్.కె, పిఆరోఓ; సాయి సతీష్,
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం; కెవి రాజమహి, నిర్మాత; ఎవిఆర్.