సినీ పరిశ్రమలోని నటీ నటులతోపాటు వివిధ శాఖలలో పనిచేసే ప్రతిభావంతులకు ‘టీఎఫ్‌సీసీ అవార్డ్స్’ గుర్తింపునిస్తుంది. ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో 2023 మే నెలలో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి దూబాయ్‌లో నిర్వహిస్తున్న ‘టీఎఫ్‌సీసీ అవార్డ్స్’ కార్యక్రమం గురించి వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ` ‘టీఎఫ్‌సీసీ అవార్డ్స్’ కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహించడం శుభపరిణామం. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎప్పడూ చిత్రపరిశ్రమకు వెన్నుదన్నుగా ఉంటాయి. రాబోయే కాలంలో మా పూర్తి సహకారం ‘టీఎఫ్‌సీసీ’ కి ఉంటుంది అన్నారు. అనంతరం టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డాక్టర్. ఆర్.కె. గౌడ్ మాట్లాడుతూ.. టీఎఫ్‌సీసీ అవార్డ్స్ దుబాయ్‌లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. రాజ్యసభ సభ్యులు, రచయిత, దర్శకులు విజయేంద్ర ప్రసాద్ గారిని కలిసి.. మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని కోరాము. వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారిని కలవడం జరిగింది.
‘టీఎఫ్‌సీసీ అవార్డ్స్’ దుబాయ్‌లో నిర్వహిన్తున్నందుకు ముందుగా టీఎఫ్‌సీసీ సభ్యులను రామ్మోహన్‌గారు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎలాంటి సహకారం అందించడానికైనా తాను ముందుంటానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సీనియర్ నటులు శివాజీ రాజాను కలిసి ‘టీఎఫ్‌సీసీ అవార్డ్స్’ వేడుక గురించి వివరించడం జరిగింది. తనకు దుబాయ్‌లో చాలా మంది స్నేహితులున్నారు. ఇంతకు ముందు దుబాయ్‌లో చాలా ఈవెంట్స్ చేసిన అనుభవం ఉంది. మీకు ఎలాంటి సహకారానైనా అందిస్తాను. నాకు మొదటి సినిమాకే నంది అవార్డు వచ్చింది. మా ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం. మీరు నిర్వహించబోయే ‘టీఎఫ్‌సీసీ అవార్డ్స్’ కార్యక్రమం విజయవంతం కావాలని శివాజీ రాజా ఆకాంక్షించారని` అన్నారు.