గ్రాండ్ గా “త్రీ మంకీస్” ప్రి రిలీజ్ ఈవెంట్..

599


జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ వెండి తెర పై ‘త్రీ మంకీస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ .జి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని దస పల్లా కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. రాఘవేంద్రరావు గారు,
మంచు లక్ష్మి, ఆకాష్ పూరి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. త్రీ మంకీస్ ట్రైలర్ ను, బిగ్ టికెట్ ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు లాంచ్ చేసారు. పూరి జగన్నాథ్, వెంకటేష్, బ్రహ్మనందం, రోజా, సాయి కుమార్ త్రీ మంకీస్ టీం కి వీడియో ద్వారా బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమం లో జబర్దస్ నటులు వేణు, చంటి, అభి, భాస్కర్, సుధాకర్, రాఘవ, డైలాగ్  రైటర్ అరుణ్, డీ.ఓ.పీ సన్నీ  మాట్లాడారు.
కథ, సంగీతం, దర్శకత్వం: అనిల్ కుమార్. జి,
నిర్మాత: నగేష్. జి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి,
లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి,
సినిమాటోగ్రఫీ: సన్నీదోమల,
ఎడిటింగ్: ఉదయ్ కుమార్,
సంగీతం: అనిల్ కుమార్ జి.
మాటలు: అరుణ్. వి,
లిరిక్స్: శ్రీమణి,
పిఆర్ఓ: వంశీ – శేఖర్.