HomeTeluguడా.రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో `తోలుబొమ్మ‌లాట‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో `తోలుబొమ్మ‌లాట‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్‌, హ‌ర్షిత‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `తోలుబొమ్మ‌లాట‌`. సుమ దుర్గా క్రియేష‌న్స్ ప‌తాకంపై దుర్గా ప్ర‌సాద్ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వ‌నాథ్ మాగంటి ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్

న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్‌, హ‌ర్షిత‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `తోలుబొమ్మ‌లాట‌`. సుమ దుర్గా క్రియేష‌న్స్ ప‌తాకంపై దుర్గా ప్ర‌సాద్ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వ‌నాథ్ మాగంటి ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని `తోలుబొమ్మ‌లాట‌` ఫ‌స్ట్ లుక్ ని శుక్ర‌వారం (జూలై 19) విడుద‌ల చేశారు.
నిర్మాత దుర్గా ప్ర‌సాద్ మాగంటి మాట్లాడుతూ “జీవిత‌మంటేనే ఒక తోలుబొమ్మ‌లాట‌. ఎవ‌రి ఆట‌ను వాళ్లు ఆడి తీరాల్సిందే. కాక‌పోతే కొన్నిసార్లు ఆ ఆట‌లో చిక్కుముడులుంటాయి. వాటిని ఎంత అందంగా విప్ప‌గ‌లిగాం? మ‌న‌వారిని వాటి నుంచి ఎంత గొప్ప‌గా విడిపించ‌గ‌లిగాం అనేది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అలాంటి అద్భుత‌మైన క‌థ‌తో విశ్వ‌నాథ్ మాగంటి ఈ సినిమా చేశారు. అనుకున్న‌దానిక‌న్నా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఇదొక విభిన్న కుటుంబ క‌థా చిత్రం. షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మా న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశాం. కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్, మంచి విలువ‌లు… ఇలా అన్నీ క‌ల‌గ‌లిసి ఉంటాయి. మంచి సినిమా చేశామ‌న్న ఆనందం ఉంది. స‌కుటుంబంగా చూసేలా ఉంటుంది. హైద‌రాబాద్‌, రామోజీ ఫిల్మ్ సిటీ, అమ‌లాపురం ద‌గ్గ‌ర‌లోని కేశ‌న‌ప‌ల్లి గ్రామం ప‌రిస‌రాల్లోని అంద‌మైన లొకేష‌న్ల‌లో షూటింగ్ చేశాం“ అని అన్నారు.
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “మా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ పేరు సోమ‌రాజు. డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు ఆ పాత్ర‌లో న‌టించారు. న‌టించార‌న‌డం క‌న్నా జీవించార‌న‌డం క‌రెక్ట్ గా ఉంటుంది.మా చిత్రంలో సోమ‌రాజుకు గోలీ సోడాలంటే ఇష్టం. కాబ‌ట్టి అంద‌రూ ఆయ‌న్ని సోడాల్రాజు అని పిలుస్తుంటారు. ఆయ‌న కుటుంబంలో కొన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయి. తండ్రిగా ఆయ‌న వాటిని ఓ కొలిక్కి ఎలా తెచ్చారు? త‌న అనుభ‌వంతో ఎలా ప‌రిష్క‌రించార‌న్న‌ది ఆస‌క్తిక‌రం “ అని అన్నారు.

న‌టీన‌టులు:
డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, విశ్వంత్‌, వెన్నెల కిషోర్‌, హ‌ర్షిత‌, దేవీ ప్ర‌సాద్‌, న‌ర్రా శ్రీనివాస్‌, నారాయ‌ణ రావు, సంగీత‌, క‌ల్ప‌న‌, శిరీష‌, చ‌ల‌ప‌తి రావు, ప్ర‌సాద్ బాబు, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్‌, తాగుబోతు ర‌మేష్‌, జ‌బ‌ర్ద‌స్త్ రాజు, దొర‌బాబు, ల‌క్ష్మ‌ణ్ మీసాల త‌దిత‌రులు

టెక్నీషియ‌న్స్ లిస్ట్: నిర్మాత‌: దుర్గా ప్ర‌సాద్ మాగంటి.ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌నాథ్ మాగంటి,ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
సంగీతం: సురేష్ బొబ్బిలి,పాట‌లు: చైత‌న్య ప్ర‌సాద్‌,కెమెరా: స‌తీష్ ముత్యాల‌,ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ర‌మేష్ నూక‌వ‌ల్లి,ఆర్ట్: మోహ‌న్ కుమార్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES