‘తొలుబొమ్మలాట’ సినిమాతో మళ్ళీ మీ గుండెల్లో నేను ఉండిపోతాను – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డా.రాజేంద్రప్రసాద్

643

డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మించారు . విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు.ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సోమవారం రాత్రి హైదరాబాద్ లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. వేడుకలో రాజేంద్రప్రసాద్, విశ్వంత్, హర్షిత, నారాయణరావు, జానకి, కల్పన, దేవి ప్రసాద్, నర్రా శ్రీనివాసరావు, సురేష్ బొబ్బిలి, చైతన్య ప్రసాద్, సతీష్, అజయ్ మోహన్ , రమేష్, నవీన్ , ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ ,మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బిగ్ సీడీ ని డా . రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు.

నటకీరిటి డా . రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ.. ఆ నలుగురు ,మీ శ్రేయోభిలాషిఓ బేబీ … ఇలా మంచి మంచి సినిమాల తరువాత నేను చేసిన మరో మంచి చిత్రం తోలుబొమ్మలాట. ఎవరికైనా సరే ఏమైనా జరగాలి అంటే.. ఒక అవకాశం వచ్చి తీరాలి అంతే. ఇలాంటి కథలకు హీరో ఎవరు అనే దాని మీద చర్చలు  అనవసరం. హీరో ఎవరో సినిమా చూశాక ఆడియెన్స్ చెబుతారు.

డైరెక్టర్ విశ్వనాధ్ మాగంటి మాట్లాడుతూ.. “ఈ నెల 22న సినిమా మీ ముందుకు రాబోతోంది. ఒక కథ అన్నిటినీ వెతుక్కొని తీసుకొస్తుందని దేవి ప్రసాద్ గారు అన్నారు. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాను తీసాం.

నిర్మాత దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. “ముందుగా 42 సంవత్సరాల కెరీర్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రాజేంద్రప్రసాద్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలువుతున్నాను. నా చిన్నప్పటి నుంచి ఆయనకు నేను అభిమానిని . లైఫ్ లాంగ్ ఇలానే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నా. డైరెక్టర్ విశ్వనాథ్ కొన్నేళ్ల క్రితం నాకు తొలుబొమ్మలాట కథ వినిపించినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది.