అక్టోబర్ 29న “తీరం” హిట్ అవుతుంది- ప్రీ- రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత యం. శ్రీనివాసులు !!

416


యంగ్ టాలెంటెడ్ హీరోస్ శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్స్ గా అఖి క్రియేటివ్స్ వర్క్స్, యల్ యస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు పై అనిల్ ఇనమడుగు దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం. శ్రీనివాసులు నిర్మించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం “తీరం” ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అక్టోబర్ 29న అత్యధిక ధియేటర్సలలో గ్రాండ్ గా విడుదల కానుంది.. ఈ సందర్బంగా.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 27న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో హీరోలు శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిస్టెన్ రవళి, సంగీత దర్శకుడు ప్రశాంత్ బిజె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేణు, పైనాన్షియర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత యం. శ్రీనివాసులు, శ్రీమతి మమత, తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.. తీరం థియేట్రికల్ యాక్షన్ ట్రైలర్ ని నిర్మాత శ్రీనివాసులు విడుదల చేశారు.. అనంతరం..

హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ.. ” ఎంతో కష్టపడి మా టీమ్ అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం.. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా రియాలిస్టిక్ గా టెక్నికల్ ఈక్విమెంట్స్ ఏమి వాడకుండా నేచురల్ గా సినిమా చేశాం. అలాంటి టైంలో మా నిర్మాత శ్రీనివాస్ గారు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది.. ఆయన వల్లే సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయగలుగుతున్నాం.. అలాగే సినేటెరియా వెంకట్ గారు థియేటర్స్ అన్ని మాట్లాడి సెట్ చేస్తున్నారు.. ఆయనకి స్పెషల్ థాంక్స్.. ఈ సినిమా తర్వాత ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్ గొప్ప పేరొస్తుంది.. అందరం కలిసి ఒక దమ్మున్న సినిమా చేశాం.. ప్రేక్షకులకు గ్యారెంటీగా ఈ సినిమా నచ్చుతుంది.. అన్నారు.

మరో హీరో శ్రావణ్ వైజిటి మాట్లాడుతూ.. ” సినిమా ఛాన్సులుకోసం వెతుకుతున్న నాకు అనిల్ ఒక మంచి అవకాశం ఇచ్చాడు.. తీరం ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది.. సినిమా చాలా బాగా వచ్చింది.. టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.. కచ్చితంగా ఇది దమ్మున్న సినిమా.. ఎవరికైనా నచ్చకపోతే నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో వారి అభిప్రాయం చెప్పొచ్చు.. అన్నారు.

హీరోయిన్ క్రిస్టెన్ రవళి మాట్లాడుతూ.. ‘ తీరంలో ఒక మంచి పాత్ర పోషించాను.. అనిల్ నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థాంక్స్.. అన్నారు.

నిర్మాత యం. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘ అంతా కొత్త వాళ్ళు కలిసి తీసిన ఈ తీరం సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.. కేవలం అనిల్ వాళ్ళ టీమ్ మీద నమ్మకంతో ఈ సినిమా చేశాను.. ప్రశాంత్ మ్యూజిక్ సినిమాకి వన్ ఆఫ్ ది ఎస్సెట్ అవుతుంది.. డెఫినెట్ గా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది.. అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినేటెరియా వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేణు, పైనాన్షియర్ సుధాకర్ రెడ్డి.. సినిమా ప్రేక్షకులందరికి నచ్చేవిధంగా అనిల్ రూపొందించారు.. తప్పకుండా ఈ చిత్రం మంచి హిట్ అవుతుంది.. అని అన్నారు.

*శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిస్టెన్ రవళి, అపర్ణ, మై విల్లేజ్ షో అనిల్, శ్రావ్య, రాగి, అజాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: ప్రశాంత్ బిజె, కెమెరా; శ్రావణ్ జి.కుమార్, కో-డైరెక్టర్స్; మోహన్ మర్రిపల్లి, రాకేష్ మాధవన్, ప్రభు ఆకాశవాణి, ఎడిటింగ్; శ్రావణ్ జి.కుమార్, సింగర్స్; ఎస్పీ బాలు, ధనుంజయ్, దివ్య ఐశ్వర్య, సాయి చరణ్, ప్రశాంత్ బీజే, పి. ఆర్. ఓ; జిల్లా సురేష్. నిర్మాత; యం. శ్రీనివాసులు, రచన- దర్శకత్వం; అనిల్ ఇనమడుగు.*