“తిప్పరా మీసం” .. ఫ్రీ-రిలీజ్ ఈవెంట్లో వి.వి.వినాయక్

507


శ్రీవిష్ణు హీరోగా నిక్కి తంబోలి హీరోయిన్ గా అసుర ఫేమ్ విజయ్ కృష్ణ ఎల్. దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో యువ నిర్మాత రిజ్వాన్ నిర్మించిన చిత్రం “తిప్పరా మీసం”. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నవంబర్ 8న వరల్డ్ వైడ్ గా గ్లోబల్ సినిమాస్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.. ఈ చిత్రం ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ నవంబర్ 3న హైదరాబాద్ దసపల్ల హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నారా రోహిత్, ప్రముఖ నిర్మాత యం యల్ కుమార్ చౌదరి, హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నిక్కి తంబోలి, దర్శకుడు కృష్ణవిజయ్.ఎల్, నటుడు, సమర్పకుడు అచ్యుత రామారావు, నటులు బెనర్జీ, నటి రోహిణి, రవిప్రకాష్, రవివర్మ , కమేడియన్ నవీన్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి తదితరులు పాల్గొన్నారు.. తొలి టిక్కెట్ ని వినాయక్, రోహిత్ కొనుగోలు చేశారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.

సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటూ ఆ కథల్లో ఇన్వాల్వ్ అవుతూ కొత్త రకం సినిమాలు చేస్తున్నాడు. బ్రోచేవారేవారురా సినిమాని  మూడుసార్లు చూశాను. నాకు బాగా నచ్చింది.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ… తిప్పారామీసం చాలా పవర్ ఫుల్ మాస్ టైటిల్.. ఇలాంటి మాస్ టైటిల్ తో చేసిన ఈ ఫంక్షన్ కి వినాయక్ గారిలాంటి మాస్ డైరెక్టర్ గెస్ట్ గా రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇటివరకు చేసిన సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉంటుంది.