HomeTeluguపాన్ ఇండియా చిత్రం "వరదరాజు గోవిందం" కూడా పెద్ద హిట్ అయి సముద్ర కి మంచి...

పాన్ ఇండియా చిత్రం “వరదరాజు గోవిందం” కూడా పెద్ద హిట్ అయి సముద్ర కి మంచి బ్రేక్ అవ్వాలి.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ హీరో సుమన్!!

సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి సముద్ర తాజాగా రవి జంగు హీరోగా ప్రీతి కొంగన హీరోయిన్ గా శివమహాతేజ ఫిలిమ్స్, వి.సముద్ర మూవీస్ బ్యానర్లు పై విజయలక్ష్మీ సమర్పణలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మాతగా “వరదరాజు గోవిందం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమాకీ భాష పరిమీదులు లేవు. ఎవరితోనైనా ఎక్కడైనా నిమా తీసి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయొచ్చు. అందుకే ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం జూన్ 9న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో చిత్ర ప్రముకులు.. శ్రేయోభిలాషులు మధ్య ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో సుమన్, నటుడు శుభలేఖ సుధాకర్, హీరో రవి జంగు, హీరోయిన్ ప్రీతి కొంగన, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహరావు, ముప్పలనేని శివ, చంద్రమహేష్, రవికుమార్ చౌదరి, శివనాగు, నగేష్ నారదాసి, గోసంగి సుబ్బారావు, అమ్మరాజశేఖర్ నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, ఛాంబర్ కార్యదర్శి కె.యల్. దామోదర ప్రసాద్, నిర్మాతలు కేకే రాధామోహన్, డిఎస్ రావు, శోభారాణి, నటులు దాసన్న, ఖదీర్, జోహార్, సంగీత దర్శకుడు డా. రవి శంకర్, కెమెరామెన్ శ్రీ వెంకట్, కో-ప్రొడ్యూసర్స్ శ్రీహరి తుమ్మెటి, జింఖాన కోటేశ్వరావు, తదితరులు పాల్గొనగా దర్శక,నిర్మాత వి.సముద్ర బొకేలతో స్వాగతం పలికారు. అనంతరం దర్శకులంతా కలిసి ‘వరదరాజు గోవిందం’ మోషన్ పోస్టర్ లాంచ్ చేయగా… నిర్మాతలందరూ కలిసి టీజర్ ను రిలీజ్ చేశారు.

ప్రముఖ నిర్మాత కేకే రాధ మోహన్ మాట్లాడుతూ.. ” మా బ్యానర్లో ఫస్ట్ మూవీ సముద్రతో అధినేత ఫిల్మ్ తీశాను.. అక్కడనుండి ఇప్పటివరకు 14సినిమాలు నిర్మించాను. సముద్ర కి సినిమా అంటే ఫ్యాషన్, కసి. ప్రతిదీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తాడు. ప్రొడక్షన్ అన్నింటిలో ఇన్వాల్వ్ అయి చేస్తాడు. ఈ సినిమాని తానే నిర్మాతగా మారి రూపొందించాడు. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా మంచి హిట్ అవుతుంది.. సముద్రతో మా సంస్థలో ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

హీరో సుమన్ మాట్లాడుతూ.. సినిమా హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటే అది కచ్చితంగా జరుగుతుంది. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరు సముద్ర మీద ప్రేమతో వచ్చారు. అందరూ సినిమా హిట్ అవ్వాలని దీవించారు. అది గ్యారెంటీగా హిట్ అవుతుంది. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాను. అలుపెరగని శ్రామికుడిలా సముద్ర ఎప్పుడూ సెట్లో నవ్వుతూ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. హీరో రవి హీరోయిన్ ప్రీతి బ్యూటిఫుల్ గా చేశారు. పోస్టర్స్, టీజర్ సూపర్బ్ గా ఉంది. కాంతారా, హనుమాన్ తరహాలోనే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అన్నారు.

శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ.. ” భగవత్ గీత అంటే భారతదేశం .. భారతదేశం అంటే భగవత్ గీత అదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం.. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. సముద్ర అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.. డెఫినెట్ గా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.

దర్శక నిర్మాత వి. సముద్ర మాట్లాడుతూ.. కృష్ణుడు బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించాం. యన్టీఆర్, రవితేజ లాగా హీరో రవి జంగు ఫుల్ ఎనర్జిటిక్ గా చేశాడు. ఈ సినిమా తనకి మంచి బ్రేక్ అవుతుంది. హీరోయిన్ ప్రీతి చక్కగా కోపరేట్ చేస్తూ.. అద్భుతంగా చేసింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు వారందరికీ నా ధన్యవాదాలు. చాలా గొప్ప కథ ఇది.. భారతదేశం గర్వించతగ్గ సినిమా అవుతుంది.. నా కెరియర్ లో సింహరాశి, శివరామ రాజు, ఎవడైతే నాకేంటి ఎంత పెద్ద హిట్ అయ్యాయో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. అన్నారు.

కేయల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..” ఇప్పుడొచ్చే సినిమాలు అన్నీ కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి.. అది కాకుండా చూసుకుంటే బాగుంటుంది. సముద్ర కి 24 క్రాఫ్ట్స్ మీద మంచి పట్టుంది. వెస్టేజీ లేకుండా సినిమా తీసే దర్శకుడు సముద్ర. టీజర్ పెంటాస్టిక్ గా ఉంది. విజువల్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా సముద్రకి మంచి హిట్ కావాలి అన్నారు.

హీరో రవి జంగు మాట్లాడుతూ.. ” హిందీ, హార్యాని, అస్సాంలలో మూవీస్ చేశాను. తెలుగులో సినిమా చేయాలని నా డ్రీమ్. సముద్ర గారు నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా హీరోగా నాకు మంచి బ్రేక్ అవుతుంది.. అన్నారు.

హీరోయిన్ ప్రీతి కొంగన మాట్లాడుతూ..” ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశాను. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన సముద్ర గారికి థాంక్స్.. అన్నారు.

సంగీత దర్శకుడు డా.రవి శంకర్ మట్లాడుతూ.. బాలీవుడ్, టాలీవుడ్ లలో సినిమాలు చేసే నాకు సముద్ర గారు ఈ సినిమాకీ మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చారు. కథకి తగ్గట్లుగా సాంగ్స్ కంపోజ్ చేయడం జరిగింది. ఆర్ ఆర్ కి మంచి స్కోప్ వుంది.. ఈ చిత్రం నాకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది.. అన్నారు.

దర్శకులంతా మాట్లాడుతూ.. వరదరాజు గోవిందం సినిమా టీజర్ చాలా బాగుంది.. సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. సముద్ర చాలా కష్టపడి ఈ చిత్రం తీశాడు.. అందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాలి అని అతిధులంతా కోరుకున్నారు..

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES